You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చార్లీ బిట్ మై ఫింగర్... అమ్మకానికి పిల్లల వైరల్ వీడియో
2007లో ఆన్‌లైన్‌లో వైరల్ అయిన "ఛార్లీ బిట్ మై ఫింగర్" (ఛార్లీ నా వేలు కొరికాడు) వీడియోను ఇప్పుడు యూట్యూబ్ నుంచి తొలగిస్తున్నారు.
"ఓహ్! ఛార్లీ నన్ను కొరికాడు. నాకు నిజంగా నొప్పి పుట్టింది".. ఇది ఛార్లీ, హ్యారీ అనే ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన వీడియో.
ఈ వీడియోలో హ్యారీ వేలును ఛార్లీ కొరుకుతాడు. ఈ వీడియోకు 88 కోట్ల వ్యూస్ వచ్చాయి.
ఇప్పుడు డేవిస్-కార్ కుటుంబం యూట్యూబ్ నుంచి ఈ వీడియోను తొలగించి నాన్-ఫంజిబుల్ టోకెన్‌గా వేలం వేస్తున్నారు.
నాన్-ఫంజిబుల్ టోకెన్ అంటే?
సాధారణంగా ఓ వస్తువును మరో వస్తువుతో కాని, నగదుతో కాని మార్పిడి/కొనుగోలు చేయలేకపోవడాన్ని నాన్-ఫంజిబుల్ అంటారు.
డిజిటల్ మాధ్యమంలో ఓ వీడియోపై సర్వ హక్కులు ఉన్నాయనేందుకు ఈ నాన్-ఫంజిబుల్ టోకెన్ ఒక సర్టిఫికెట్ లాంటిది. నాన్-ఫంజిబుల్ అంటే వైరల్ వీడియో వెర్షన్లను, మీమ్‌లను, ట్వీట్‌లను కూడా కళారూపాల్లా అమ్ముకోవచ్చు. ఇప్పుడు చార్లీ బిట్ మై ఫింగర్ వీడియోను ఇలానే వేలానికి ఉంచుతున్నారు.
హ్యారీ, ఛార్లీల ఈ వీడియోను వారి తాతకు ఈ-మెయిల్ చేసే సౌలభ్యం లేకపోవడంతో 2007లో ఆ పిల్లల తండ్రి హోవార్డ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
పిల్లల బాల్యానికి సంబంధించిన ఆనందకర, సరదా సందర్భాలను రికార్డు చేసే సమయంలో ఈ వీడియోను తీసినట్లు వారి కుటుంబ వెబ్‌సైట్ చెబుతోంది. అయితే, అనుకోకుండా ఈ వీడియో వైరల్ అయింది.
"ఈ పిల్లల్లో ఒకరికి ఇప్పుడు 17 సంవత్సరాలు, మరొకరికి 15 సంవత్సరాలు. త్వరలోనే వాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. అందుకే మళ్లీ ఇంటర్నెట్‌లో మరోసారి కనిపించడానికి ఇదే సరైన సమయం" అని ఆ సైట్‌లో రాశారు.
"దీని అర్థం.. ఈ వైరల్ వీడియో ఇకపై ఉండదు అని కాదు, ఇదో కొత్త ప్రారంభం మాత్రమే" అని ఆ సైట్ పేర్కొంది.
అధిక మొత్తాన్ని బిడ్ చేసి ఈ వీడియోకు నాన్-ఫంజిబుల్ టోకెన్ గెలుచుకున్నవారు... హ్యారీ, ఛార్లీలతో కలిసి ఆ వీడియోకు పేరడీ చేసే అవకాశం లభిస్తుందని ఆ వెబ్‌సైట్ చెబుతోంది. మే 22న ఈ వీడియో వేలం మొదలవుతుంది. దీనికి చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు వస్తుందని భావిస్తున్నారు.
డిజాస్టర్ గర్ల్ మీమ్ - వెనక మంటలు మండుతుంటే ఓ అమ్మాయి నవ్వుతున్నట్లుగా ఉన్న ఒక ఫొటో ఇటీవల నాన్-ఫంజిబుల్ టోకెన్ వేలంలో 4,73,000 డాలర్లకు అమ్ముడుపోయింది.
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి జో రోత్‌కు ఇప్పుడు 21 సంవత్సరాలు. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాలకు ఇస్తానని చెప్పారు. తన విద్యా రుణం తీర్చేస్తానని అన్నారు.
అయితే, ఛార్లీ బిట్ మై ఫింగర్ వీడియో వేలం ద్వారా వచ్చే సొమ్ముతో ఏం చేయబోతున్నారో డేవిస్-కార్ ఫ్యామిలీ వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి.
- కరోనా సెకండ్ వేవ్: ఆక్సిజన్ సరఫరాలో మోదీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది
- ముంబై మోడల్ ఆక్సిజన్ సరఫరా అంటే ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాలు దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి?
- కోవిడ్ వ్యాక్సినేషన్: రెండు రకాల టీకాలు వేసుకున్నవారిలో 'మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్' పెరిగాయి: ఆస్ట్రాజెనెకా అధ్యయనం
- కరోనావైరస్: కేంద్ర ఆరోగ్య శాఖను నితిన్ గడ్కరీకి ఇవ్వాలా.. దీనిపై ఎందుకు చర్చ మొదలైంది
- కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- కోవిడ్ వ్యాక్సీన్: టీకా తీసుకున్నా వైరస్ సోకడం దేనికి సూచిక.. వ్యాక్సినేషన్‌కు ఇది సవాలుగా మారనుందా
- కోవిడ్: కలవరపెడుతున్న రంజాన్ షాపింగ్.. ఇసుకేస్తే రాలనట్లుగా పాతబస్తీ రోడ్లు
- కోవిడ్-19: DRDO కనిపెట్టిన '2-DG' ఔషధం కరోనావైరస్ను ఎదుర్కొనే బ్రహ్మాస్త్రం కాబోతోందా?
- ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కోవిడ్: ప్రోనింగ్ అంటే ఏమిటి.. కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ పద్ధతితో ప్రాణాలు కాపాడవచ్చా
- కోవిడ్ టెస్ట్‌లకు వాడిన కిట్లను శుభ్రం చేసి తిరిగి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)