You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా: 330 అడుగుల ఎత్తున గాజు వంతెనకు వేలాడిన సందర్శకుడు.. కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
చైనాలోని పియాన్ పర్వతం వద్ద ఓ ఎత్తయిన గాజు వంతెన నుంచి వేలాడుతున్న వ్యక్తిని రక్షించారు.
ఒక్కసారిగా గట్టిగా గాలి వీయడంతో వంతెనపై ఉన్న గ్లాస్ ప్యానెల్స్ దెబ్బతినడంతో దానిపై నడుస్తున్న వ్యక్తి కిందకు జారి వేలాడుతూ ఉండిపోయారు.
చైనాలోని ఈశాన్య ప్రాంతంలో పియాన్ పర్వతం వద్ద ఉన్న 100 మీటర్ల ఎత్తయిన బ్రిడ్జ్ (సుమారు 330 అడుగులు)ను శుక్రవారం ఆ వ్యక్తి సందర్శిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గంటకు 150 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న గాలి ధాటికి వంతెన మీదున్న గాజు ఫ్లోర్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది.
చైనాలో సుమారు 2,300 గాజు వంతెనలు, నడక మార్గాలు, స్లైడ్‌లు ఉన్నాయని భావిస్తున్నారు.
టూరిజంను ప్రోత్సహించేందుకు, పర్యటకులను ఆకర్షించేందుకు ఈ గాజు వంతెనలను కట్టారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో ఆ వ్యక్తి వంతెన మధ్యలో వేలాడుతూ కనిపిస్తున్నారు.
ఈ గాజు వంతెన లాంగ్‌జింగ్ నగర ప్రాంతంలో ఉంది.
వంతెనపై వేలాడుతున్న వ్యక్తిని కాపాడడానికి అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడే ఉన్న ఆన్-సైట్ సిబ్బంది సహాయంతో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆ ఆస్పత్రి తెలిపింది.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు. సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని లాంగ్‌కింగ్ సిటీ వీబో పేజీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- చైనా రాకెట్ భూమ్మీదకు దూసుకొచ్చింది... ముక్కలు ముక్కలై హిందూ మహాసముద్రంలో పడిపోయింది
- గంగానదిలో తేలిన 100కి పైగా శవాలు.. కరోనా లెక్కల్లో రాకుండా నదిలో పడేస్తున్నారా
- కరోనా విషయంలో భారత్కు చైనా చేస్తున్న సాయం రెండు దేశాల సంబంధాలను మెరుగు పరుస్తుందా ?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ వేరియంట్ 1000 రెట్లు స్పీడా... అందుకే ఏపీ ప్రజలంటే ఇతర రాష్ట్రాలు భయపడుతున్నాయా
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- సైనోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్వో ఆమోదం.. ఇప్పటికే కోట్ల మందికి పంపిణీ
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)