You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పీరియడ్స్ సమయంలో సెలవు ఇవ్వని ఎయిర్‌లైన్స్ మాజీ సీఈఓకు జరిమానా
దక్షిణకొరియాలో ఓ విమానయాన సంస్థ మాజీ సీఈఓ తమ సిబ్బందిలో మహిళలు పీరియడ్స్ కారణంగా సెలవులు అడిగితే నిరాకరించినందుకుగానూ కోర్టు ఆయనకు సుమారు 1,800 డాలర్ల జరిమానా విధించింది.
దక్షిణ కొరియాలో మహిళా ఉద్యోగులు పీరియడ్స్ సమయంలో సెలవు పెట్టేందుకు ఆ దేశ ఉపాధి చట్టం వీలు కల్పిస్తుంది. ఆ చట్టం ప్రకారమే ఈ జరిమానా విధించింది.
ఆసియానా ఎయిర్‌లైన్స్ మాజీ అధిపతి కిమ్ సూ-చెయోన్ 2014, 2015లో తమ సంస్థలో పనిచేస్తున్న 15 మంది మహిళలు పీరియడ్స్ సమయంలో పెట్టుకున్న సెలవులను నిరాకరించారు.
వారు రుతుస్రావానికి సంబంధించిన రుజువులు చూపలేదని కిమ్ వాదించారు.
దక్షిణ కొరియాలో 1953 నుంచి మహిళా ఉద్యోగులు పీరియడ్స్ సమయంలో అవస్థ ఎక్కువగా ఉంటే నెలకు ఒకరోజు సెలవు తీసుకోవచ్చనే చట్టం అమలులో ఉంది.
ఈ అంశంలో 2017లో తొలిసారిగా కిమ్‌పై కింది కోర్టులో విచారణ జరిగింది.
రుతుస్రావమని చెప్పి సెలవులు అడిగిన మహిళల్లో చాలా అనుమానాస్పద కేసులు ఉన్నాయంటూ కిమ్ కోర్టులో వాదించారని సౌత్ కొరియా వార్తా సంస్థ యోన్‌హాప్ తెలిపింది.
అయితే, రుతుస్రావానికి సాక్ష్యం చూపించాలని అడగడం "వ్యక్తిగత గోప్యతకు, మానవ హక్కులకు భంగమని" కోర్టు తేల్చి చెప్పింది.
తరువాత, కిమ్ పై కోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
కాగా, పై కోర్టు కిమ్ వాదనను తిరస్కరిస్తూ, కింది కోర్టు తీర్పునే సమర్థించింది.
ఇవి కూడా చదవండి:
- PCOD: పీరియడ్స్ లేటయితే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా?
- కశ్మీర్ ప్యాడ్ ఉమన్: శానిటరీ ప్యాడ్ కొనడానికే సిగ్గుపడిన ఆ మహిళ ఇప్పుడు వాటిని అందరికీ పంచుతున్నారు
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)