You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్‌లో బలగాలను సెప్టెంబరు 11నాటికి ఉపసంహరించుకుంటామన్న అమెరికా - Newsreel
అఫ్గానిస్తాన్‌లో తమ దేశ బలగాలు సెప్టెంబరు 11నాటికి పూర్తిగా ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో ప్రకటన చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మే నాటికి బలగాలను వెనక్కి తీసుకుంటామని తాలిబాన్లతో గత ఏడాది ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఈ గడువును తాజాగా అమెరికా పొడిగిస్తోంది.
2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌లపై ఉగ్రవాద దాడులు జరిగి అప్పటికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతాయి.
మే 1నాటికి బలగాలను ఉపసంహరించుకోవడం కష్టమని ఇప్పటికే బైడెన్ స్పష్టంచేశారు.
మరోవైపు శాంతి స్థాపనకు తాము ఇచ్చిన మాటలు, వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో అతివాద ఇస్లామిక్ తాలిబాన్లు విఫలం అవుతున్నారని అమెరికా, నాటో అధికారులు ఎప్పటికప్పుడే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఉపసంహరణ సమయంలో అమెరికా బలగాలపై దాడులు చేస్తే, కఠిన పరిణామాలను తాలిబాన్లు ఎదుర్కోవాల్సి వస్తుందని రిపోర్టర్లతో అమెరికా అధికారులు చెప్పారు.
త్వరత్వరగా ఉపసంహరించుకుంటే అమెరికా బలగాలకే ముప్పని బైడెన్ భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ అంశంపై బుధవారం బైడెన్ ఒక ప్రటకన చేసే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)