పాకిస్తాన్: బలూచిస్తాన్‌లో వందలాది మంది పురుషులు అదృశ్యం.. వారంతా ఏమైపోతున్నారు?

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్: బలూచిస్తాన్‌లో వందలాది మంది పురుషులు అదృశ్యం.. వారంతా ఏమైపోతున్నారు?

2000వ సంవత్సరం తొలినాళ్లలో పాకిస్తాన్ అమెరికాతో కలిసి ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించింది.

అదే సమయంలో బలూచిస్తాన్‌లో సాయుధ తిరుగుబాటు బలం పుంజుకుంటోంది. ఆ నేపథ్యంలో ప్రభుత్వ బలగాలు బలవంతంగా అనేక మందిని తీసుకెళ్లిపోయేవి. వీటిని బలవంతపు అపహరణలుగా చెబుతున్నారు.

ఆ తర్వాత వందలాది మంది పురుషులు కనిపించకుండా పోవడం సర్వసాధారణమైపోయింది. వారిలో చాలామంది తిరిగి రాలేదు. మరికొందరు కొన్ని నెలల తర్వాత చనిపోయి కనిపించారు.

ఈ బలవంతపు అపహరణలు ఇప్పటికీ జరుగుతున్నాయి. దీనికంతటికీ భద్రతా బలగాల సంస్థలదే బాధ్యతని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఆరోపణలను సెక్యూరిటీ ఏజెన్సీలు పూర్తిగా తిరస్కరించట్లేదు కానీ అలా అదృశ్యమైన వాళ్లు పూర్తి అమాయకులు మాత్రం కాదని చెబుతున్నాయి.

బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తోన్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)