కరోనావైరస్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) ఇంట్లోనే...

వీడియో క్యాప్షన్, కరోనా వైరస్ ఇంటెన్సినవ్ కేర్ యూనిట్ (ఐసీయూ) ఇంట్లోనే...

దేశ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పరిమితంగా ఉంది. దీంతో కరోనా వైరస్ బారిన పడిన సంపన్నులు ఆస్పత్రులకు వెళ్లకుండా... ఆస్పత్రినే ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఏకంగా ఇంట్లోనే ICU లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఈ పద్ధతి ఖరీదైనదే అయినా ఆస్పత్రిలో పేషెంట్ల సంఖ్య పెరిగిపోవడంతో ఇంటి వద్దే చికిత్స తీసుకోవడం సురక్షితమం అని చాలా మంది భావిస్తున్నారు.

ఇంటివద్ద ఐసీయూ ఏర్పాటు చేసుకున్నప్పుడు రోగి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని డాక్టర్‌కు అందించేందుకు ఒక నర్సు ఉండాలి. అయితే, వ్యాధి తీవ్రతను బట్టి ఈ హోం ఐసీయూ సురక్షితమా కాదా అన్నది వైద్యులు నిర్ధరిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)