కరోనా లాక్‌డౌన్: తల్లులు ఒక దేశంలో.. పసి పిల్లలు మరొక దేశంలో..

ఉక్రెయిన్‌లో సరోగసీని చట్టబద్ధం చేశారు. దీంతో సరోగసీ మంచి వ్యాపారంలా మారింది.

ఉక్రెయిన్ మహిళలు తమ గర్భాలను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అందుకు వాళ్లు 50 వేల డాలర్లు తీసుకుంటున్నారు.

కాగా, ఇలా సరోగసీ తల్లులకు పుట్టిన పిల్లలు చాలామంది కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా ఉక్రెయిన్‌లోని ఒక హోటల్ లో చిక్కుకుపోయారు.

వాళ్ల తల్లిదండ్రులు చైనా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాల్లో ఉన్నారు.

ఈ పసివాళ్లు తమ తల్లిదండ్రుల్ని ఎలా కలవనున్నారు? వివరాలు పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)