You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెనెజ్వెలా: మహిళలు ఒక్కొక్కరు ఆరుగురు పిల్లల్ని కనాలని చెప్పిన అధ్యక్షుడు మదురో
వెనెజ్వెలా అధ్యక్షుడు నికొలస్ మదురో, ''దేశం మేలు కోసం'' ఆరుగురు పిల్లల్ని కనాలని తన దేశ మహిళలకు విజ్ఞప్తి చేశారు.
దేశంలో మహిళలకు ఆరోగ్య పరిక్షణ ప్రణాళికను ప్రచారం చేస్తూ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న మదురో.. ''పిల్లల్ని కనండి.. పిల్లల్ని కనండి'' అని మహిళలకు సూచించారు.
వెనిజువెలా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. దాని ఫలితంగా దేశంలో తీవ్రమైన ఆహార, మందుల కొరత నెలకొంది.
వెనిజ్వెలాలో 2013 - 2018 మధ్య చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడ్డారని ఐక్యరాజ్యసమితి చిన్నారుల సంస్థ యూనిసెఫ్ నివేదిక చెప్తోంది.
ప్రభుత్వం, ప్రతిక్షాల మధ్య అధికారం కోసం సాగిన తీవ్రమైన సంఘర్షణ కారణంగా దేశ కష్టాలు మరింతగా పెరిగాయి.
ప్రతిపక్ష నాయకుడు యువాన్ గుయాయిడోను వెనిజువెలాకు చట్టబద్ధమైన నాయకుడిగా 50 పైగా దేశాలు పరిగణిస్తున్నాయి. కానీ.. వామపక్ష నాయకుడైన అధ్యక్షుడు మదురోకి సైన్యం మద్దతు ఉంది. ఆయన అధికారంలోనే కొనసాగుతున్నారు.
''ఆరుగురు చిన్నారి బాలబాలికలకు జన్మనిచ్చిన మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు'' అని తాజా ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమానికి హాజరైన ఒక మహిళతో మదురో చెప్పారు.
''దేశం మేలు కోసం ప్రతి మహిళా ఆరుగురు పిల్లలకు జన్మనివ్వాలి'' అని పేర్కొన్నారు. మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ.. ''ఇది మహిళల వారం'' అన్నారు.
గుయాయిడో మద్దతుదారులు ట్విటర్‌లో ఆగ్రహంగా స్పందించారు. ప్రతిపక్షం ఆధిక్యంలో ఉన్న నేషనల్ అసెంబ్లీ సభ్యురాలు మాన్యుయెలా బొలీవర్ ఒక ట్వీట్‌లో: ''ఆస్పత్రులు పనిచేయటం లేదు. వ్యాక్సిన్ల కొరత ఉంది. మహిళలు తమ శిశువులకు పాలు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వారు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పసిపిల్లల ఆహారం కొనలేరు. అదికొనే స్తోమత వారికి లేదు. మానవ అత్యవరసర పరిస్థితి కారణంగా దేశంలో బలవంతపు వలసలు జరుగుతున్నాయి'' అని మండిపడ్డారు.
''ఇలా మాట్లాడుతున్న మదురో, ఆయన ప్రభుత్వం మానసికంగా దూరమయ్యారు'' అని విమర్శించారు.
వెనిజ్వెలాలో కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది?
ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం నివేదిక ప్రకారం.. వెనిజ్వెలాలో ప్రతి ముగ్గురిలో ఒకరు.. కనీస పోషకాహారాలకు అవసరమైనంత ఆహారం సంపాదించుకోలేకపోతున్నారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో.. 2018లో వీధుల్లో వదిలివేసిన శిశువులు, ప్రభుత్వ భవనాల వద్ద వదిలివేసిన శిశువుల సంఖ్య 70 శాతం పెరిగిందని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.
వెనిజ్వెలా ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాల్లో అధికారిక గణాంకాలేవీ విడుదల చేయలేదు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- నాలుగేళ్లలో 23 లక్షల మంది వెనెజ్వేలాను ఎందుకొదిలేశారు? దేశ సంక్షోభానికి కారణాలేంటి?
- వెనెజ్వెలా వలసలు: బతుకుతెరువు కోసం కాలినడకన దేశాలు దాటుతున్నారు
- కరోనావైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్: చైనాలో ఇళ్లకే పరిమితమైన కోట్లాది మంది ప్రజలు ఏం చేస్తున్నారు?
- దిల్లీలో అలర్లు చేయించేందుకు ముస్లింలకు డబ్బులు పంచారా? : Fact Check
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)