You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కూలిన ఉక్రెయిన్ బోయింగ్ 737, విమానంలోని 170 మందికి పైగా మృతి
ఉక్రెయిన్ ప్రయాణికుల విమానం ఇరాన్‌లో కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 170 మందికి పైగా మృతిచెందారు.
ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ఒక బృందాన్ని నియమించామని ఉక్రెయిన్ ప్రభుత్వం చెప్పింది.
ఒమన్ పర్యటనకు వెళ్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెంస్కీ ప్రయాణం మధ్యలో ముగించి తిరిగి రాజధాని కీవ్ బయల్దేరారు.
విమాన ప్రమాదంలో మరణించిన వారి బంధువులు, స్నేహితులకు సంతాపం తెలుపుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఘటనకు ఇరాన్-అమెరికా ఘర్షణతో ఏదైనా సంబంధం ఉందా అనేది ఇంకా తెలీడం లేదు.
ఈ విమానంలో ప్రయాణించడానికి 168 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రధాని ఒలెక్సీ హొంచరుక్ చెప్పారు.
రాయిటర్స్ వార్తల ప్రకారం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ ఖామెనెయీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాగానే ప్రమాదానికి గురైంది.
సాంకేతిక సమస్యల కారణంగా ఈ విమానం ప్రమాదానికి గురైందని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ చెప్పింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెళ్తోంది.
విమానాశ్రయం దగ్గర ఘటనాస్థలం దగ్గరకు సహాయ సిబ్బందిని పంపించారు.
"విమానం మంటల్లో ఉంది. కానీ మేం సిబ్బందిని పంపించాం. కొంతమందినైనా కాపాడగలమని అనుకుంటున్నాం" అని ఇరాన్ అత్యవసర సేవల అధికారి పిర్హొస్సేన్ కౌలీవాండ్ రాయిటర్స్‌తో అన్నట్లు ఇరాన్ టీవీ చెప్పింది.
ఇరాన్ రెడ్ క్రిసెంట్ హెడ్ మీడియాతో కూలిన విమానంలో ఎవరూ సజీవంగా ఉండే అవకాశాలు లేవని అన్నారు.
(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది)
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ ప్రతిదాడి: ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణి దాడులు
- ఇస్రో: 'గగన్‌యాన్' వ్యోమగాముల ఎంపిక ఎలా జరుగుతుంది?
- ఉదయించే సూర్యుడు ఉన్న ఈ జెండాపై వివాదమెందుకు?
- వివాహ వేదికల నుంచి ఉచిత న్యాయ సేవల వరకు... పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా యువత ఎలా ఉద్యమిస్తున్నారు?
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)