You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉడుము దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధ జంట
ఆస్ట్రేలియాలో ఒక వృద్ధ జంట ఉడుము(గొవానా) దాడిలో గాయపడింది.
దాన్నుంచి పెంపుడు కుక్కను కాపాడే క్రమంలో ఇద్దరూ గాయపడ్డారని వారిని కాపాడిన అధికారులు చెప్పారు.
ఈశాన్య క్వీన్స్‌లాండ్‌లో ఈ ఘటన జరిగింది. జంటలో 70 ఏళ్ల వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు.
మహిళకు 60 ఏళ్లు. ఆమెకు కూడా పాదానికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. వీరి పెంపుడు కుక్క కూడా తీవ్రంగా గాయపడింది.
గొవానాలు 2 మీటర్ల వరకూ పొడవు పెరుగుతాయి. ఇవి మనుషులపై అరుదుగా దాడిచేస్తుంటాయి.
ఎయిర్లీ బీచ్ దగ్గర ఫ్లేమ్‌ట్రీ అనే ప్రాంతంలో జరిగిన ఈ దాడి భయంకరంగా ఉందని వారిని కాపాడిన అధికారులు చెప్పారు.
తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడికి చెయ్యి చీలిందని, ఎముక విరుగుండచ్చని భావిస్తున్నారు. కాలి గాయం నుంచి కూడా తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. అతడు నొప్పితో అల్లాడిపోయినట్లు అంబులెన్స్ సిబ్బంది చెప్పారని ఏబీసీ న్యూస్ పేర్కొంది.
ఆ గొవానాలు చాలా భయంకరమైనవి వీళ్లకు అదృష్టవశాత్తూ పెద్ద గాయాలు కాకుండా తప్పించుకున్నారు అని మరో అంబులెన్స్ సిబ్బంది బీబీసీతో అన్నారు. అవి దాడిచేయడం ఇలా ఎప్పుడో ఒకసారి జరుగుతుంటుందని చెప్పాడు.
వృద్ధ జంట కాపాడాలని ప్రయత్నించిన పెంపుడు కుక్క బల్లి దాడిలో చనిపోయిందని మొదట వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అది ప్రాణాపాయం నుంచి బయటపడిందని బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)