కత్తులతో పొడిచేసినా చనిపోతూ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

కెల్లీ మేరీ

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, కెల్లీ మేరీ

లండన్‌లో ఓ నిండుచూలాలిని పొడిచి చంపేశారు. మృతురాలిని 26 ఏళ్ల కెల్లీ మేరీ ఫావ్రెల్‌గా పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

శనివారం ఉదయం కెల్లీపై ఈ దాడి జరిగింది.

సమాచారం అందుకున్న లండన్ అంబులెన్స్ సర్వీస్.. ఘటన స్థలానికి రెండు అంబులెన్స్ వాహనాలను, ఒక హెలికాప్టర్ అంబులెన్స్‌ను పంపింది.

దాడి జరిగిన చోటే పారామెడిక్ సిబ్బంది కెల్లీకి ప్రసవం చేశారు. పుట్టిన పాప పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు.

కెల్లీ ఎనిమిది నెలల గర్భంతో ఉండుండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వారు చెప్పారు.

లండన్ పోలీస్

ఫొటో సోర్స్, PA Media

హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు.

''మహిళలపై హింస పేట్రేగిపోతోంది. ఇలాంటి ఘటనలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి'' అని ట్విటర్‌లో ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)