వీడియో: మేకల్ని నరికినట్లు మనుషుల్ని నరికేస్తున్న క్రిమినల్ గ్యాంగ్‌లు
మధ్య అమెరికాలోని చిన్న దేశం ఎల్ సాల్వడార్ .. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి నేరాల సంఖ్య మాత్రం చాలా చాలా పెద్దది. సుమారు 60 వేల క్రిమినల్ ముఠాలు దేశ ఆర్ధిక స్థితిగతులను కూడా అదుపు చేస్తున్నాయి.
కేవలం గతేడాదిలోనే మొత్తం 3 వేల మంది వీరికి బలయ్యారంటే ఇక్కడ నేర తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్వెరిన్ అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మీ మనసుని కలచివేయొచ్చు.
చీకటి అలుముకోగానే వీధుల్లో సాధారణ ప్రజలెవరూ కనిపించరు.
రాత్రంతా నేరస్థ ముఠాలదే రాజ్యం. వారు డ్రగ్స్ అమ్ముతారు, అక్రమ వసూళ్లకు పాల్పడతారు. కదిలే ప్రతిదాన్నీ అదుపు చేయాలని చూస్తారు.
ఇప్పుడు పోలీస్ ఇన్ఫార్మర్లుగా మారిన ఇద్దరు మాజీ గ్యాంగ్ స్టర్లను మేం కలిశాం. మేం వారి పేర్లు వెల్లడి చేయలేం. వారి గొంతును వినిపించలేం.
తానిప్పటికే 56 మంది ప్రజలను చంపాని ఒకతను ఒప్పుకున్నాడు. చంపుతూ ఉండటమే తమ వృత్తని అతను చెబుతున్నాడు.
మాజీ గ్యాంగ్ స్టర్ 1: ‘‘మొదటి హత్య కత్తితో చేశాను. అతడు ప్రత్యర్థి ముఠా సభ్యుడు. అక్కడ చాలా మంది వద్ద తుపాకులుంటాయి. నేను చివరగా చంపిన వ్యక్తినైతే కాళ్లు, చేతులు అన్నింటినీ ముక్కలు ముక్కలుగా నరికాను. శరీరం లోపలి భాగాలన్నీ బయటకు తీశాం’’.
బీబీసీ రిపోర్టర్: ‘అంటే ఓ కసాయి మేకను చంపినట్టుగా... మీరు మనుషుల్ని కోసి పోగులు పెట్టారన్న మాట.’
మాజీ గ్యాంగ్ స్టర్ 1: ‘‘ఆ క్షణంలో వాళ్ళు నా శత్రువులు... అంతే... గ్యాంగ్‌లో చేరాలంటే నేను ఏడుగురిని చంపాల్సిందే. గ్యాంగ్‌లో ర్యాంక్ రావాలంటే మనుషుల్ని ఎప్పుడూ చంపుతూనే ఉండాలి.’’
మరో వ్యక్తి పదిహేనేళ్ల వయసు నుండే హత్యలు చేయడం మొదలుపెట్టి తన ప్రాంతంలో ఓ లీడర్ అయ్యాడు. తన పాత గ్యాంగ్‌కు తను దొరికిపోతే మాత్రం తనకు స్పెషల్ ట్రీట్మెంట్ తప్పదని అంటున్నాడు.
మాజీ గ్యాంగ్ స్టర్ 2: ‘‘నన్ను దారుణంగా హింసించి, సజీవ దహనం చేస్తారు. వాళ్లు నన్ను ఖండఖండాలుగా చేస్తూ మెల్లిగా చంపేస్తారు.’’
బీబీసీ రిపోర్టర్: ‘మీరు చంపేసిన వ్యక్తుల కుటుంబాలకు మీరేం చెప్తారు? వారి గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..?’
మాజీ గ్యాంగ్ స్టర్ 2: ‘‘నేనేం చెప్పినా చనిపోయిన వాళ్లను వెనక్కి తీసుకురాలేను. నేను ఇప్పటికే ఎందరో తల్లుల కొడుకులను, ఎంతో మంది సోదరులను, స్నేహితులను శాశ్వతంగా దూరం చేశాను. ఇక నేను వారికేం చెప్పుకున్నా తక్కువే. రోజూ ప్రశ్చాత్తాప పడటం తప్ప మరో మార్గం లేదు.’’
ఇలాంటి నేరస్థ ముఠాలను అంతం చేయడానికి మరో ఆపరేషన్ నిర్వహించే పనిలో ఉన్నాయి భద్రతా దళాలు.
ఈ నెలలోనే భాధ్యతలు చేపట్టిన ఎల్ సాల్వడార్ నూతన అధ్యక్షుడు నయిబ్ బుకెలె ఈ ముఠాలను ఉక్కుపాదంతో అణిచేవేయాలని ప్రయత్నిస్తున్నారు.
రక్తపు మరకలతో నిండిన ఈ దేశంలో చీకట్లను పారదోలే మరో ప్రయత్నం ఇది.
ఇవి కూడా చదవండి:
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- మెక్సికో: రోజుకు 71 హత్యలు.. డ్రగ్స్, నేరాలతో ముదురుతున్న సంక్షోభం
- ఎల్ చాపో గజ్మన్: ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడిపై ముగిసిన విచారణ
- కొలంబియా: కుక్కను చంపితే రూ. 50 లక్షలు.. తలకు వెల కట్టిన డ్రగ్ మాఫియా.. కుక్కకు భద్రత పెంచిన పోలీసులు
- కన్నకొడుకుని కామాంధులకు ఆన్లైన్లో అమ్మేసిన తల్లిదండ్రులు
- ఇది ఓ డాన్ కథ: బడా రాజన్ ‘ప్రేమ’.. చోటా రాజన్ ‘పగ’
- ఇక్కడ పచ్చళ్లు అంటూ పార్సిల్ చేతిలో పెడతారు.. అక్కడ విమానం దిగగానే జైల్లో పెడతారు!
- 'ఇండియా గెలవాలి... దేవుడా' అని పాకిస్తానీలు ఎందుకు కోరుకుంటున్నారు?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు.. కోర్టుకెళ్తే ఒక్కరికే ఇచ్చారు
- ఆరెంజ్ జెర్సీల్లో కనువిందు చేయనున్న 'మెన్ ఇన్ బ్లూ'
- జీ-20 శిఖరాగ్ర సదస్సు: ఏమిటీ భేటీ? ఇక్కడ ప్రపంచ నాయకులు ఏం చర్చిస్తారు...
- బిహార్: వేధింపులను అడ్డుకున్నందుకు తల్లీకూతుళ్లకు గుండు కొట్టించి ఊరేగించారు
- మనిషి మాట్లాడడం ఎప్పుడు మొదలుపెట్టాడు...
- ఆంధ్రప్రదేశ్‌లో క్రిమినల్ కేసులున్న మంత్రులెందరు.. వారిలో అత్యంత సంపన్నులెవరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)