You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నైజీరియా: టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా ఆత్మాహుతి దాడి.. 30మంది మృతి
ఈశాన్య నైజీరియాలో టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా హాల్ బయట ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 30మంది మరణించారని అధికారులు తెలిపారు. మూడుచోట్ల జరిగిన పేలుళ్లలో 40 మంది గాయపడ్డారని నైజీరియా అత్యవసర సేవల విభాగం తెలిపింది.
ఈ దాడి వెనుక ఇస్లాం మిలిటెంట్ సంస్థ బోకో హరామ్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ దాడి గురించి ఆ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
బోర్నో రాష్ట్రంలో ప్రారంభమైన ఈ సంస్థ, గత దశాబ్ద కాలంగా ఈశాన్య నైజీరియాలో తిరుగుబాటు చేస్తోంది.
టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ప్రదర్శిస్తున్న హాల్ యజమాని, ఒక ఆత్మాహుతి బాంబర్ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాడని, కొండుగ లోని ఆత్మరక్షణ సంస్థకు చెందిన అలీ హసన్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో అన్నారు.
''తనను తాను పేల్చుకోవడానికి ముందు ఆ సుసైడ్ బాంబర్‌కు, టీవీ హాల్ ఆపరేటర్‌కు వాగ్వివాదం తారాస్థాయిలో జరిగింది'' అని ఆయన అన్నారు.
టీవీ హాల్ వద్ద బాంబు పేలగానే, సమీపంలోని మరో ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు కూడా పేలుడు జరిపారు.
గతంలో కూడా కొండుగ ప్రాంతం లక్ష్యంగా దాడులు జరిగాయి. 2018 జూలైలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిగినపుడు 8 మంది చనిపోయారు.
బోకో హరామ్‌తో జరుగుతున్న ఈ పోరులో ఇంతవరకూ కనీసం 27వేల మంది చనిపోగా, 20లక్షల మంది ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లారు.
ఇవి కూడా చదవండి
- తమిళులు హిందీని ఎందుకు అంతలా వ్యతిరేకిస్తున్నారు...
- పాకిస్తాన్ బడ్జెట్: ఈ అప్పుల 'విషవలయం' నుంచి ఇమ్రాన్ ఖాన్ బయటపడేది ఎలా?
- కష్టమైన ఇంగ్లిష్ స్పెల్లింగుల్ని మార్చేయడం కరెక్టేనా?
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
- స్విట్జర్లాండ్: సమాన వేతనం, గౌరవం కోసం రోడ్డెక్కిన మహిళలు
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- అర్థరాత్రి దాటినా నిద్ర పోవట్లేదా? మీ జీవ గడియారాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఎలా?
- తియానన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని సమర్థించిన చైనా మంత్రి, అసలు ఆరోజు ఏం జరిగింది
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా అమ్మాయిలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)