You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- రచయిత, రోమన్ క్రజ్నారిక్
- హోదా, రాజనీతి తత్వవేత్త, బీబీసీ కోసం
రాబోయే ఎన్నికల గురించే తప్ప.. భవిష్యత్తు తరాల గురించి రాజకీయ నాయకులు ఆలోచించకుండా అడుగులు వేస్తే ఏమవుతుంది?
ప్రజలకు తాత్కాలిక తాయిలాలు ఆశ చూపి అందలం ఎక్కే పాలకుల వల్ల భవిష్యత్తు ప్రజానికం మనుగడ ఏమవుతుంది? దీనిపై రాజనీతి తత్వవేత్త రోమన్ క్రజ్నారిక్ అందిస్తున్న విశ్లేషణ ఇది.
డేవిడ్ హ్యూమ్ అనే తత్వవేత్త 1739లో రాసిన 'ది ఆర్జిన్ ఆఫ్ సివిల్ గర్నమెంట్' పుస్తకంలో ''ప్రజలు.. తమను తాము కానీ, ఇతరులను కానీ విప్లవాత్మకంగా బాగు చేసుకోలేరు. వారి ఆత్మకు ఉన్న ఈ సంకుచిత స్వభావం, జడత్వం కారణంగానే.. వారు (ప్రజలు) భవిష్యత్తు కంటే ప్రస్తుత స్థితినే ఇష్టపడతారు'' అని అంటారు.
''ప్రజాప్రతినిధులు, పార్లమెంటరీ చర్చలు మన స్వార్థపూరిత కోరికలను నెరవేర్చడానికి పనిచేస్తున్నాయి తప్పితే దీర్ఘకాలిక సమాజ సంక్షేమాన్ని, ఆకాంక్షలను పట్టించుకోవడం లేదు'' అని డేవిడ్ హ్యూమ్ ఉద్దేశం
డేవిడ్ హ్యూమ్ వ్యాఖ్యలు ఇప్పటి ప్రజాస్వామ్య వ్యవస్థలకు చక్కగా సరిపోతున్నాయి.
మన రాజకీయ వ్యవస్థలు దీర్ఘకాలిక ప్రయోజనాలను మరిచి స్వల్పకాలిక ఫలితాలపైనే దృష్టిపెడుతున్నాయి. అంతేకాదు తాజా ఒపీనియన్ పోల్స్, ట్వీట్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నాయి.
శీఘ్ర పరిష్కార మార్గాలకే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఆర్థిక, సామాజిక అసమానతల వల్ల జరిగే నేరాలను అర్థం చేసుకొని వాటికి పరిష్కార మార్గాలను కనుగొనాల్సిందిపోయి నేరాలు చేసిన వారిని వెంటనే జైలుకు పంపే విధానం మీదే ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాయి.
అంతర్జాతీయ సమావేశాల్లోనూ తమ తాత్కాలిక ప్రయోజనాల మీద దేశాలు దృష్టిపెడుతున్నాయి కానీ, అరుదైన జాతులు అంతరించే ప్రమాదం మీద, భూతాపం మీద మాట్లాడటం లేదు.
సోషల్ మీడియా అలాగే, డిజిటల్ టెక్నాలజీ ఇప్పుడు రాజకీయాల్లో తమ కంటూ కొంత స్థలాన్ని ఆక్రమించుకున్నాయి. ఈ తరుణంలో తాత్కాలిక ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వాలు వ్యవహరించడడం అనేది వీటి ఉత్పత్తిగానే భావించాలి.
రాజకీయ వ్యాపార చక్రం
ఎన్నికల ప్రక్రియలోనే సమస్య ఉంది. రాజకీయ నాయకులు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం వెతకుండా ఓటర్లను ఆకట్టుకునేందుకు పన్నుల మినహాయింపులాంటి తాయిలాలు ప్రకటిస్తారు. 1970 లలో ఇలాంటి విధానపర నిర్ణయాలను తీసుకునే స్థితిని రాజకీయ వ్యాపార చక్రంగా అభివర్ణించేవారు.
తమ ఓటు బ్యాంకును సురక్షితంగా ఉంచుకునేందుకు సమాజంపై దీర్ఘకాలికంగా పడే భారాన్ని గుర్తించకుండా కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ఇలాంటి రాజకీయ వ్యాపార చక్రంలో ఒక భాగం.
ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చడం, భారీ బడ్జెట్ తీసుకొచ్చేందుకు లాబీయింగ్ చేయడం ద్వారా కార్పొరేట్ సంస్థలు రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీని వల్ల ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధాన నిర్ణయాలను తీసుకోలేవు.
మరో అతి ముఖ్యమై సమస్య ఏమిటంటే, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భవిష్యత్తు ప్రజల ప్రయోజనాలను విస్మరించడం.
భవిష్యత్తు ప్రజలకు ఎలాంటి హక్కులు ఇవ్వడం లేదు. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు తీసుకునే ప్రతీ నిర్ణయం ముందు తరాలపై ప్రభావం చూపిస్తుంది.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై దశాబ్దానికి పైగా ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను పనిచేసినా ఎక్కడా నాకు ఈ అంశం కనిపించలేదు.
గతకాలంలో మహిళలు, బానిసలు ఎలా పౌరహక్కులు కోల్పోయారు అదే మాదిరిగా భవిష్యత్తులో ప్రజలు కూడా పౌరహక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదే వాస్తవం కూడా.
అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పాఠశాల విద్యార్థులు స్వీడన్ టీనేజర్ గ్రెట థంబర్గ్ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నారు. ధనిక దేశాలు తమ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలని ఈ స్వీడన్ టీనేజర్ కొన్నాళ్లుగా పోరాడుతున్నారు.
భవిష్యత్తును వలస ప్రాంతాలుగా మార్చే ప్రక్రియ
అసందగ్ధ వాస్తవాలను ఎదుర్కొనే సమయం వచ్చేసింది. నవీన ప్రజాస్వామ్యం ముఖ్యంగా ధనిక దేశాలకు సంబంధించిన రాజకీయ వ్యవస్థలు భవిష్యత్తును వలసలుగా మార్చేందుకు పని మొదలు పెట్టాయి.
భవిష్యత్తు అనేది ప్రజలు లేని సుదూర వలస ప్రాంతంగా ఉంటుంది. అక్కడ మనం స్వేచ్ఛగా మన పర్యావరణ వ్యర్థాలను, అణువ్యర్థాలను పడేస్తాం.
18, 19వ శతాబ్దంలో బ్రిటన్ ... ఆస్ట్రేలియాను వలస దేశంగా మార్చినప్పుడు అక్కడి భూమి ఎవరికీ చెందకుండా ‘ట్రెరా నల్లియస్’ అనే చట్టరపరమైన సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. స్థానికులకు వారి భూమిపై ఎలాంటి హక్కులు లేకుండా చేసింది.
ఇప్పుడు మన వైఖరి కూడా ట్రెరా నల్లియస్ సిద్ధాంతాన్నే పోలీ ఉంది. భవిష్యత్తు ప్రజలు జీవించే హక్కులను ఇలానే కాలరాస్తున్నాం. వారి వనరులను ముందుగానే మనం వాడుకుంటున్నాం.
అందుకే మన కాలంలో ఈ సమస్యే అత్యంత ముఖ్యమైన రాజకీయ సవాలని నేను భావిస్తున్నా.
మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమికంగా తాత్కాలిక పరిష్కారాలకే ఉందని, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆకాంక్షించే నియంతల పాలనే మెరుగని కొంతమంది సూచిస్తున్నారు.
ఇలా భావిస్తున్న వ్యక్తుల్లో ప్రముఖ బ్రిటన్ ఖగోళ శాస్త్రవేత్త మార్టిన్ రీస్ ఒకరు. వాతావరణ మార్పులు, జీవవాయుధాల వ్యాప్తిపై ఆయన అనేక వ్యాసాలు రాశారు.
'జ్ఞానోదయం అయితే తప్పితే 21 వ శతాబ్దాన్ని సురక్షితంగా నడిపించే చర్యలు తీసుకోలేరు' అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నేను ఒక ప్రజావేదికలో ఆయనను కలిసినప్పుడు మీరు నిజంగా నియంతృత్వ పాలన రావాలని కోరుకుంటున్నారా అని అడిగాను.
దీనిపై వాస్తవానికి తాను అంత సీరియస్‌గా లేనని ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా చైనా పాలన విధానం ఉదాహరణగా చూపించారు. దీర్ఘకాలిక ప్రణాళికతో సౌర విద్యుత్ ఉత్పత్తిపై ఆ దేశం భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. అక్కడ ఉన్న చాలా మంది ప్రేక్షకులు ఆశ్చర్యకరంగా ఆయన చెప్పిదానికి తలూపుతూ ఏకీభవించారు. కానీ, నేను మాత్రం అందులో లేను.
ఎందుకంటే నియంతృత్వ పాలనలో దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుంటారనేదానికి కొద్దిస్థాయి రుజువులే ఉన్నాయి.
ఉదాహరణకు ప్రజాస్వామ్య దేశమైన స్వీడన్‌లో 60 శాతం విద్యుత్ వినియోగం పునర్వినియోగ శక్తి మీదే ఆధారపడి ఉంది. ఇది చైనా సాధించిన 26 శాతం కంటే అధికం.
అంతేకాదు ఫిన్లాండ్ లాంటి కొన్ని దేశాలు భవిష్యత్తు ప్రజల అవసరాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం ఒక పార్లమెంటరీ కమిటీని కూడా ఆ దేశం ఏర్పాటు చేసింది. 2001, 2006 మధ్యలో ఇజ్రాయిల్ భవిష్యత్తు తరాల కోసం ఒక అంబుడ్స్‌మెన్‌ను ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పుడు ఆ అంబుడ్స్‌మెన్ వ్యవస్థను రద్దు అయింది.
ఫ్యూచర్ జనరేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన వేల్స్‌ను కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. దీనికి సోఫీ హోవే కమిషనర్‌గా ఉన్నారు. 2015లో ఈ కమిషన్.. వెల్ బీయింగ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ పేరుతో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. యూకే మొత్తానికి ఇలాంటి చట్టాలు రావాలని డిమాండ్లు వస్తున్నాయి.
జపాన్‌లో కొత్త విప్లవం
కానీ, భవిష్యత్తు ప్రజల పౌరహక్కులను కాపాడే విషయంలో ఇవన్నీ స్వల్పమైన చర్యలు మాత్రమే. కెనడా పర్యావరణ ప్రచారకుడు డేవిడ్ సుజికీ మరిన్ని విప్లవాత్మక ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
భవిష్యత్తు సమస్యలపై ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ అసెంబ్లీలోనే ప్రజాప్రతినిధులు విధాన నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు. కానీ, ప్రజలు తమ ప్రస్తుత ప్రయోజనాలను పక్కన పెట్టి భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తారా?
జపాన్‌లో ఫ్యూచర్ డిజైన్ అని కొత్తగా ఒక విప్లవం పుట్టుకొచ్చింది. భవిష్యత్తు తరాల ప్రయోజనాలను పరిరక్షించడమే ఈ విప్లవం ముఖ్య ఉద్దేశం.
క్యోటోలోని హ్యుమానిటీ అండ్ నేచర్ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న పర్యావరణ వేత్త టట్సుయోషి సాయిజో ఈ విప్లవానికి నేతృత్వం వహిస్తున్నారు. దేశంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ విప్లవానికి సంబంధించిన వ్యక్తులు చర్చలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తమ సభ్యులను రెండుగా విభజించి ఒక గ్రూపులో ప్రస్తుత ప్రజలను, మరో గ్రూపులో భవిష్యత్తు ప్రజలు(2060 కాలం నాటి వారు) ఉన్నారని ఉహించుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాత రెండు గ్రూపుల మధ్య చర్చలు పెడుతున్నారు.
దేశంలో మినిస్టరీ ఆఫ్ ఫ్యూచర్ అనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నదే ఈ విప్లవం లక్ష్యం. అలాగే, ప్రతీ ప్రభుత్వ శాఖలోనూ భవిష్యత్తు అవసరాలను పరిరక్షించే విభాగాన్ని ఏర్పటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చారిత్రక రాజకీయ మార్పు జరుగుతున్న సంధికాలంలో మనం ఉన్నాం. భవిష్యత్తు తరాల అవసరాలు, హక్కులను పరిరక్షించే ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. పర్యావరణ వ్యవస్థ నాశనమవుతుంటే, సాంకేతిక ప్రమాదాలు ఎక్కువ అవుతుంటే ఈ ఉద్యమాలు మరింత ఊపందుకుంటాయి.
దీర్ఘకాలిక సంక్షోభాల పరిష్కారానికి నియంతృత్వ పాలన ఒక్కటే పరిష్కార మార్గం కాదు. 18వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన ప్రాచీన గ్రీకు ప్రజాస్వామ్యం నుంచి ఇప్పటి ప్రతక్ష్య ప్రజాస్వామ్య వ్యవస్థల వరకు దీర్ఘకాలిక సంక్షోభాలను నివారించే అనేక సంస్కరణలను తీసుకొచ్చాయి.
ఇవి కూడా చదవండి
- ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- భారత ఓటర్లు ఏం కోరుకుంటున్నారు.. బలమైన నాయకత్వమా, ప్రజాస్వామ్యమా
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- అంబేడ్కర్‌తో బీబీసీ అరుదైన ఇంటర్వ్యూ: 'సరైనవారు ఎన్నికైతేనే ఎన్నికలకు విలువ'
- మోదీ ఎన్నికల మంత్రం: ‘దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం’తో... సామాజిక, ఆర్థిక సమస్యలు బలాదూర్
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
- పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- భారతదేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకు సాధ్యం కాదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)