You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
న్యూజీలాండ్ కాల్పులు: ‘దాడికి పాల్పడిన వ్యక్తి పేరును పలకను' - ప్రధాని జసిండా ఆర్డెన్
న్యూజీలాండ్ మసీదుల్లో కాల్పులు జరిపిన వ్యక్తి పేరును ఇకపై తానెప్పుడూ ఉచ్ఛరించనని న్యూజీలాండ్ ప్రధాని జెసిండ్ ఆర్డెన్ ప్రతిజ్ఞ చేశారు.
''ఒక భయోత్పాతం కలిగించే దాడి వల్ల అతడు చాలా ఆశించాడు. వాటిల్లో ఒకటి.. తాను ప్రసిద్ధి చెందాలని. అందుకే.. అతడి పేరును ఇకపై నేను ఉచ్చరించను'' అని ప్రధాని ఆర్డెన్ పార్లమెంటులో అన్నారు.
గత శుక్రవారం న్యూజీలాండ్‌లోని రెండు మసీదులపై జరిగిన దాడిలో 50 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. ఆస్ట్రేలియాకు చెందిన 28 ఏళ్ల బ్రెంటన్ టారంట్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
''దాడికి పాల్పడిన వ్యక్తికంటే, ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తుచేసుకోండని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అతడు ఓ టెర్రరిస్ట్, నేరస్థుడు, ఒక తీవ్రవాది. తన పేరును నేను ఉచ్ఛరించే సమయానికి అతను అనామకుడు అవుతాడు'' అని ఆమె అన్నారు.
మంగళవారం జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'అస్సలాం ఆలేకుమ్'(మీకు శాంతి కలుగుగాక) అంటూ.. అరబిక్ భాషలో ఆమె అభివాదం చేశారు.
దాడికి చెందిన వీడియోలను షేర్ చేయకుండా నియంత్రించాలని సోషల్ మీడియా వేదికలను కూడా కోరారు.
''సోషల్ మీడియా వేదికల్లో దాడి వీడియోలు షేర్ అవుతుంటే మేం చూస్తూ కోర్చూలేము. ‘మా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని జరిగే పోస్టులకు మేం బాధ్యత వహించం’ అంటే అంగీకరించబోము. సోషల్ మీడియా అన్నది పోస్ట్‌మన్ లాంటిది కాదు. వాళ్లు పబ్లిషర్లు. బాధ్యత లేని వ్యాపారం చేస్తాం.. అంటే సహించేది లేదు'' అని ఆమె హెచ్చరించారు.
బాధితుడు.. న్యూజీలాండ్ చట్టాల తీవ్రతను ఎదుర్కోకతప్పదని ఆమె పార్లమెంటులో అన్నారు. న్యూజీలాండ్‌లోని ముస్లిం మతస్థుల బాధను గుర్తించాలని అందర్నీ కోరారు.
దాడిలో మరణించినవారిని ఇంకా గుర్తించాల్సివుంది. ఇంతవరకూ మృతదేహాలను ఖననం చేయలేదు. కానీ ముస్లిం సంప్రదాయంలో.. ఓ వ్యక్తి మరణించాక, మృతదేహాన్ని శుభ్రం చేసి, వీలయినంత వెంటనే ఖననం చేస్తారు.
శుక్రవారం మసీదుల్లో ప్రార్థనల సందర్భంగా దాడి జరిగింది. ఈ దాడుల్లో చనిపోయినవారిలో ముస్లిం వలసవాదులతోపాటు, శరణార్థులు, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, కువైట్, సోమాలియాల వచ్చి ఇక్కడ స్థిరపడినవారున్నారు.
ఈ దాడి అనంతరం, దేశంలోని ఆయుధ చట్టాలను కఠినతరం చేసే మార్పులు తీసుకువస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
మిలిటరీ తరహా ఆయుధాలకు కొన్ని మార్పులు చేసి, వాటిని మరింత ప్రమాదకారిగా తయారుచేసిన ఆయుధాన్ని నిందితుడు వాడాడని, ఇలాంటి ఆయుధాల వాడకం, ప్రస్తుత చట్టాల ప్రకారం నేరం కాదని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఈ బొమ్మలు స్త్రీ వక్షోజాల వెనకున్న కథలు
- జనసేన అభ్యర్థుల తాజా జాబితా: లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి బరిలో సీపీఐ
- జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి... ఒక పార్టీకి జాతీయ హోదా ఎలా వస్తుంది...
- మొబైల్ డేటా: ప్రపంచంలో అత్యంత చౌక భారతదేశంలోనే... మున్ముందు ధరలు పెరిగిపోతాయా...
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)