You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘పాకిస్తాన్, భారత దేశాలు సంయమనం పాటించాలి’
పాకిస్తాన్‌పై భారత్ వైమానిక దాడుల అనంతరం చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, అంతర్జాతీయ సహకారంతో భారత్ 'టెర్రరిజం'కు వ్యతిరేకంగా పోరాడాలని చైనా కోరినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ విషయమై మాట్లాడుతూ.. 'ఈ సంఘటనలకు సంబంధించిన నివేదికలను మేం పరిశీలించాం' అని చైనా విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి లూ కాంగ్ మీడియాతో అన్నారు.
''దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు ప్రధానమైనవే. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పర సహకారం నెలకొంటే, అది భారత్-పాక్ ప్రయోజనాలతోపాటు, దక్షిణాసియాలో శాంతి నెలకొల్పడానికి కూడా తోడ్పడతాయి. ఇప్పటికైనా భారత్, పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించి, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటాయని ఆశిస్తున్నాం..'' అని లూ కాంగ్ అన్నారు.
పాక్‌పై వైమానిక దాడుల నేపథ్యంలో.. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆస్ట్రేలియా కోరింది.
''భారత్, పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడరాదని ఆస్ట్రేలియా కోరుతోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మేం ఆశిస్తున్నాం. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇదివరకే ఖండించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉండే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది'' అని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి మారిస్ పేయ్న్ అన్నారు.
‘‘భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలను మేం గమనిస్తున్నాం. ఇరు దేశాలతో మేం టచ్‌లో ఉన్నాం. ఉద్రిక్తతలు మరింత పెంచకుండా, రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆశిస్తున్నాం’’ అని యూరోపియన్ యూనియన్ తెలిపింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)