You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#Balakot: ‘చెంప దెబ్బ కొడితే, మేం మరో చెంప చూపించే రోజులు పోయాయి’ - వైమానిక దాడిపై ప్రముఖుల స్పందన
భారత యుద్ధవిమానాలు లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటి బాంబు దాడులు జరిపినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ యుద్ధ విమానాలు పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరం నుంచి బయల్దేరాయి. నియంత్రణ రేఖను దాటి నిర్దేశిత లక్ష్యాలపై బాంబులు వేశాయి.
ఈ ఘటనపై చాలామంది ప్రముఖులు ట్విటర్ వేదికగా స్పందించారు.
బీజేపీ తరఫున కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దాడులను ధ్రువీకరిస్తూ, 'ఈరోజు ఉదయం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై వాయు సేన వైమానిక దాడులు జరిపి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇది ప్రారంభం మాత్రమే' అని ట్వీటర్‌లో పేర్కొన్నారు.
'నేను భారత వైమానిక దళ పైలట్లకు సెల్యూట్ చేస్తున్నాను' అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
'పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాల లక్ష్యాలపై దాడి చేసి మనల్ని గర్వపడేలా చేసిన భారత వాయుసేన సాహసానికి నేను సెల్యూట్ చేస్తున్నా' అని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
'మేం కేవలం రెండే కొట్టాం. కానీ, సాలిడ్‌గా కొట్టాం' అంటూ అమితాబ్ బచ్చన్ డైలాగ్‌ను బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ ట్వీట్ చేశారు.
'మీరు చెంప దెబ్బ కొడితే, మేం మరో చెంప చూపించే రోజులు పోయాయి. దానికి బదులు మీరు ఆ పని మళ్లీ చేయకుండా కాలర్ పట్టుకొని కొడతాం' అంటూ రచయిత చేతన్ భగత్ ట్వీట్ చేశారు.
'ఉగ్రవాద శిబరాలను భారత వాయుసేన ధ్వంసం చేసినందుకు గర్వంగా ఉంది. Quiet no more' అంటూ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు.
'భారత వాయుసేనను చూస్తే గర్వంగా ఉంది. జై హింద్' అంటూ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ్‌తో పాటు ఆయన భార్య ఉపాసన కొణిదెల కూడా పేర్కొన్నారు.
ఎన్‌సీపీ నేత శరద్ పవార్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, నటి సమంతా లాంటి వాళ్లు భారత వాయు సేనకు శుభాకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు పాకిస్తాన్ సైనిక బలగాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేస్తూ... నియంత్రణ రేఖను భారత వైమానిక దళం అతిక్రమించిందని, దీనిపై పాకిస్తాన్ వైమానిక దళం తక్షణం దీటుగా ప్రతిస్పందించిందని, దీంతో భారత యుద్ధవిమానాలు వెనుదిరిగాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్-పాకిస్తాన్ యుద్ధం తప్పదా? ఈ యుద్ధం ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది?
- ‘పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్ల ఫొటో నిజమేనా’
- రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?
- భారత్-రష్యా: ఆయుధాలు, మసాలాలు కాకుండా ఇంకేం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి?
- ఇస్లామిక్ దేశాల ముఖ్య అతిథిగా భారత్ ఏం సాధిస్తుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)