You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పపువా న్యూ గినీ: జనాభా 80 లక్షలు... మాట్లాడే భాషలు 800
పపువా న్యూ గినీ... ఆస్ట్రేలియా సమీపంలో పర్వతాలతో నిండిన చిన్న దేశం ఇది. ఈ దేశ జనాభా కేవలం 80 లక్షలు. కానీ, ఇక్కడ దాదాపు 800 భాషలు వాడుకలో ఉన్నాయి.
కొన్ని శతాబ్దాలుగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మనుగడ సాగిస్తున్న తెగలు ఇక్కడ అనేకం ఉన్నాయి. అందువల్ల పురాతన మూలాలు కలిగిన అనేక భాషలు ఇంకా మనుగడలో ఉన్నాయి.
ఇక్కడి కేంద్రప్రభుత్వం బలహీనంగా ఉండటం కూడా భాషా వైవిధ్యానికి దోహదపడింది. దీంతో ఇక్కడ 800కు పైగా భాషలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.
వాటిలో వేల సంఖ్యలో మాత్రమే మాట్లాడే కెరెవో లాంటి భాషలు కూడా ఉన్నాయి.
ఇక్కడ నేటికి 20 శాతం జనాభా మాత్రమే పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నారు.
ఇంగ్లిష్ మాట్లాడే వలస పాలకుల వల్ల టాక్ పిసిన్ భాష పుట్టింది. ఇవాళ పిడ్‌జిన్ ఇంగ్లిష్ అక్కడ చాలా విస్తృతంగా ఉపయోగించే భాషగా మారింది.
మరోవైపు కెరెవో లాంటి భాషను మాట్లాడే ప్రజలు కేవలం కొన్ని వేల మందే మిగిలారు.
ఇవి కూడా చదవండి:
- పపువా న్యూ గినీ: చైనా అమ్ముల పొదిలో కొత్త అస్త్రం?
- రఫేల్ డీల్ ఆడియో టేపు లీక్.. మొత్తం సంభాషణ ఇదే..
- ‘అచ్రేకర్ సర్‌తో అద్భుతమైన నా ప్రయాణం అలా ప్రారంభమైంది’ - సచిన్ తెండూల్కర్
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- చైనా యూత్ ఒకరికి మించి ఎందుకు కనడం లేదు? ఇద్దరిని కనేందుకు ఎందుకు భయపడుతున్నారు?
- 2018లో పెరిగిన విమాన ప్రమాద మరణాలు.. ఒక్క ఏడాదే 556 మంది చనిపోయారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)