You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్: బొమ్మలు
ఆటబొమ్మలను ఇకపై బాలురు, బాలికల లింగాలను బట్టి వారిని ప్రత్యేకంగా లక్ష్యం చేసుకుని మార్కెట్ చేయటం మానేయాలని ఆధునిక ఆటబొమ్మల పరిశ్రమ మీద ఒత్తిడి పెట్టాల్సిందిగా పాశ్చాత్య సమాజంలో ఇటీవల ఉద్యమాలు మొదలయ్యాయి.
బాలికలను లక్ష్యంగా చేసుకోవటానికి ‘పింక్’ రంగును ఉపయోగించటం మానాలని కూడా విమర్శకులు కోరుతున్నారు. నిర్దిష్టంగా బాలికలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ చేసే ఆటవస్తువుల్లో బొమ్మలు (డాల్స్) ఒక ముఖ్యమైన ఉదాహరణ.
పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు.. వారు పెద్దయ్యాక ఏమవ్వాలన్న వారి ఆకాంక్షల మీద ప్రభావం చూపవచ్చునన్నది సమానత్వ ఉద్యమకారుల వాదన.
ఇంట్లో పనులు చేసే పాత్రలను పోషించటాన్ని ప్రోత్సహించే.. లేదా ఫ్యాషన్ కానీ సౌందర్య ఉత్పత్తుల మీద కానీ కేంద్రీకృతం చేసే ఆటవస్తువలను మాత్రమే బాలికలకు ఇచ్చినట్లయితే.. వారు తమను తాము శాస్త్రవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా, ప్రపంచ నాయకులుగా ఊహించుకునే అవకాశం తక్కువగా ఉంటుందని విమర్శకులు వాదిస్తున్నారు.
కొన్ని సంస్థలు.. అస్తిత్వం గురించి మనుషులు ఎలా ఆలోచిస్తారనే దానిని సవాల్ చేసే బొమ్మలను ఉద్దేశపూర్వకంగా తయారు చేస్తున్నాయి. ట్రాన్స్‌జెండర్ బొమ్మలు, వైకల్యాలు ఉన్న బొమ్మలు, శరీర రూపురేఖలు పెద్దగా ఉండే బొమ్మలు తయారు చేసి అందిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- పేరెంటింగ్: తల్లిదండ్రుల తగవులు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతాయో మీకు తెలుసా?
- ఆడపిల్లల చదువుకు అనుకూలంగా లేని 10 దేశాలు
- ‘ఆడపిల్ల చదువుకు అంత ఖర్చు దేనికి?’.. ఈ ప్రశ్నకు కారణాలేంటి?
- మేకప్ వీడియోలు: మనం కనిపించే తీరును సోషల్ మీడియా మార్చేస్తోందా?
- నొక్కువిద్య పవక్కలీ: ఈ బొమ్మల కళను కాపాడుతున్న చివరి వ్యక్తి ఈ అమ్మాయే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)