సెరెనా విలియమ్స్: రొమ్ము కేన్సర్‌పై అవగాహనకు పాటపాడిన క్రీడాకారిణి

టెన్నిస్ రాకెట్‌తో మైదానంలో చెలరేగిపోయే సెరెనా విలియమ్స్ గొంతు సవరించారు.

'బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్' సందర్భంగా 'రొమ్ము క్యాన్సర్' పై మహిళల్లో అవగాహన కల్పించేందుకు నడుము పై భాగంలో ఎలాంటి ఆచ్చాదన లేకుండా రొమ్ముపై చేతులు పెట్టి పాట పాడారు.

ఆస్ట్రేలియా రాక్ బ్యాండ్ సంస్థ డివైనల్ రూపొందించిన 'ఐ టచ్ మై సెల్ఫ్' పాటను సెరెనా విలియమ్స్ ఆలపించారు.

తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఈ పాటకు సంబంధించిన పోస్ట్ కనిపించింది.

ఈ పాటను 1990లో మొదటిసారి విడుదల చేశారు. మహిళల లైంగిక సంతృప్తి నేపథ్యంగా ఈ పాట వెలువడింది. అయితే, క్యాన్సర్‌ను సూచించే గడ్డలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు మహిళలు తమ రొమ్ములను పరీక్షించుకోవడం ఎంత ముఖ్యమో చెప్పేలా ఈ పాట నేపథ్యాన్ని మార్చి ఇప్పుడు వాడారు.

''ఐ టచ్ మై సెల్ఫ్ ప్రాజెక్ట్‌లో ఈ మ్యూజిక్ వీడియో భాగంగా ఉంది. రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయిన డివా, చిర్సీ, అంఫ్లెట్‌ల గౌరవార్థం దీన్ని రూపొందించారు. మహిళలకు ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యం అని గుర్తు చేస్తూ వారు ప్రపంచానికి ఈ సూపర్ హిట్ పాటను అందించారు.'' అని ఈ టెన్నిస్ దిగ్గజం తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ పాట రికార్డింగ్ తనను కంఫోర్ట్ జోన్ నుంచి బయట పడేసిందని విలియమ్స్ తెలిపారు.

ఈ వీడియోను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. సెరెనా బాగా పాడారని చాలా మంది ప్రశంసించారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)