You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై ఆర్థిక మోసం కేసు
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సెక్యూరిటీ మోసాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో ఆ కంపెనీ షేరు ధర దారుణంగా పతనమైంది.
ప్రస్తుతం పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా ఉన్న టెస్లాను పూర్తిగా సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నానని, అందుకు అవసరమైన నిధులు కూడా సమకూర్చుకున్నట్టు ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన ప్రకటన పూర్తిగా "అబద్ధమని, అది అందరినీ పక్కదారి పట్టించేలా" ఉందని ఎస్‌ఈసీ వ్యాఖ్యానించింది.
వాటాదారులతో చర్చించకుండానే మస్క్ ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించారని ఆరోపించింది. దాంతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించకుండా అతనిపై నిషేధం విధించాలని కోరుతూ న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది.
అయితే, మస్క్ మాత్రం తనపై దావా వేయడం "అన్యాయమని", తాను ఏ పొరపాటూ చేయలేదని, "నిబద్ధత, పారదర్శకత"తో వాటాదారుల ప్రయోజనాల మేరకే వ్యవహరించానని అన్నారు.
"నా జీవితంలో నీతి, నిబద్ధతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. నేను ఏనాడూ అవకతవకలకు పాల్పడలేదన్న వాస్తవాలు బయటపడతాయి" అని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
"ఎలాన్ మస్క్ మీద, ఆయన నిబద్ధత, నాయకత్వం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది" అని టెస్లా డైరెక్టర్ల బోర్డు వ్యాఖ్యానించింది.
తాను టెస్లా సంస్థను స్టాక్ ఎక్సేంజ్ నుంచి డీ-లిస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు గత నెలలో మస్క్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. అందుకోసం నిధులు కూడా సమీకరించుకున్నట్లు తెలిపారు.
టెస్లా ఒక్కో షేర్ ధర 20 శాతం డీ-లిస్టింగ్ ప్రీమియంతో కలిపి 420 డాలర్లుగా వెలకట్టినట్టు కూడా ఆయన చెప్పారు.
అయితే, వాటాదారులతో ఏమాత్రం చర్చించకుండానే మస్క్ ఏకపక్షంగా ఆ నిర్ణయం తీసుకున్నారని ఎస్‌ఈసీ ఆరోపించింది. అంతేకాదు, మస్క్ చెప్పినట్టుగా ఆ రోజు మార్కెట్లు ముగిసే సమయానికి టెస్లా షేర్ విలువ 420 కాదని, 419 మాత్రమేనని ఎస్‌ఈసీ వెల్లడించింది. అయితే, ఆ విలువను తాను రౌండ్ ఫిగర్ చేశానని మస్క్ అన్నారు.
తాజా పరిణామాలతో టెస్లా షేర్ ధర ఒక్కసారిగా 10 శాతం దాకా పతనమైంది.
ఇవి కూడా చదవండి:
- ఇష్టపూర్వక వివాహేతర సంబంధం నేరం కాదు : సుప్రీం కోర్టు
- ఆడవారిని మగవారుగా, మగవారిని ఆడవారుగా ఎలా మార్చుతారు?
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- స్నేహానికి సరిహద్దులు లేవని నిరూపించిన చిన్నారులు
- అంతరిక్షంలోకి కొత్త జంటల ప్రేమ సందేశాలు
- 360 డిగ్రీల వీడియో: లక్షలాది భక్తుల యాత్ర
- కరణ్ థాపర్: ‘మోదీ ముఖంలో కోపం, అడ్వాణీ కళ్లలో నీళ్లు, భుట్టో చూపులో ప్రేమ.. అన్నీ చూశా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)