You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
360 డిగ్రీల వీడియో: లక్షలాది భక్తులతో ప్రారంభమైన పండరీపుర యాత్ర
లక్షలాది భక్తుల కోలాహలం మధ్య భక్త తుకారం, భక్త ధ్యానేశ్వర్‌ల పల్లకీలు పండరీపురానికి యాత్రగా బయలుదేరాయి. మహారాష్ట్రలో సుమారు 800 ఏళ్లనాటి నుంచి ఈ యాత్ర జరుగుతోంది. 21రోజులపాటు సాగే ఈ పల్లకీ యాత్ర జులై 23న విఠలనాథుడి దర్శనంతో ముగుస్తుంది.
12వ శతాబ్దంలో మహారాష్ట్రలో వెల్లువెత్తిన భక్తి ఉద్యమానికి సిసలైన ఉదాహరణగా పండరీపుర యాత్రను చెబుతారు. ఈ పల్లకీలను అనుసరిస్తూ సాగేవారిలో చాలావరకూ రైతులు, కూలీలే ఉంటారు. స్వాముల పాదుకల వెంట నడుస్తూ అభంగాలను ఆలపిస్తూ వారంతా ముందుకు సాగుతారు. వీటన్నింటిలో ముఖ్యమైనది పుణె సమీంపలోని ఆలండి నుంచి బయలుదేరే భక్త ధ్యానేశ్వర్ పల్లకి, దేహు గ్రామం నుంచి బయలుదేరే భక్త తుకారాం పల్లకి. ఇంకా భక్త సోపన్‌దేవ్, భక్త ముక్తాబాయ్, భక్త గోరా కుంభార్‌ల పల్లకీలు కూడా యాత్ర మధ్యలో వీటితో కలుస్తాయి.
ఎన్నో శతాబ్దాలుగా ఈ యాత్ర జరుగుతోంది. ఇందులో ప్రముఖంగా అందరినీ ఆకట్టుకునే అంశం... భక్తుల క్రమశిక్షణ. పల్లకీల వెంట నడిచే భక్తులను గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపును డిండి అని పిలుస్తారు. ఈ డిండీలకు నంబర్లు కేటాయిస్తారు. ఏ నంబరు గ్రూపు ఏ పల్లకీకి ముందు నడవాలి, వెనక నడవాలి అనే విషయాలన్నీ ముందే నిర్దేశిస్తారు. అంతా దానిప్రకారమే జరిగిపోవడం ఈ యాత్రలో ప్రత్యేకం.
దివేఘాట్ పర్వత ప్రాంతాల గుండా సాగే ఈ యాత్రకు వర్షాలు చాలా ఆంటకాలు కలిగిస్తుంటాయి. ఎన్ని ఇబ్బందులెదురైనా పల్లకీలు మాత్రం ముందుకు సాగుతూనే ఉంటాయి.
ఈ యాత్రలో మరో ముఖ్యమైన, ఆసక్తికరమైన ఘట్టం... రింగన్. అంటే భక్తులంతా ఓ వలయంలాగా ఏర్పడగా, ఆ వలయం నుంచి రాజాశ్వంగా భావించే ఓ గుర్రం దూసుకెళ్తుంది.
ఇవి కూడా చదవండి.
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- చూసి తీరాల్సిందే: ప్రపంచంలోనే అత్యంత తెలివైన కాకి ఇదేనేమో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)