You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆస్ట్రేలియాలో నాయకత్వ సంక్షోభం.. ప్రధాన మంత్రి టర్న్‌బుల్ పదవికి గండం
ఆస్ట్రేలియాలో నాయకత్వ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆ దేశ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాన్ని వాయిదా వేసింది.
ప్రధానమంత్రి మాల్కొమ్ టర్న్‌బుల్ తన పదవిని సుస్థిరం చేసుకోడానికి పార్టీలోని సీనియర్ నేతలతో పోరాడుతున్నారు.
ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, కన్జర్వేటివ్ పార్టీలో తిరుగుబాటుతో గతకొంతకాలంగా ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
''ఈ ప్రభుత్వం ఇంకా ఎంతోకాలం కొనసాగదు'' అని ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు బిల్ షార్టెన్ అన్నారు.
''ఈ ప్రభుత్వం పార్లమెంట్‌ను వాయిదా వేసిఉండొచ్చు. కానీ, వైఫల్యాలను మాత్రం అధిగమించలేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
సెప్టెంబరు 10 వరకు పార్లమెంటును సస్పెండ్ చేసేందుకు వీలుగా గురువారం ప్రతినిధుల సభలో ఓటింగ్ జరగింది. 70-68 తో తీర్మానం నెగ్గింది.
పార్టీ సీనియర్ నేత డట్టన్...టర్న్‌బుల్‌పై తిరుబాటు జెండా ఎగురవేశారు. ఆయన నాయకత్వాన్ని సవాలు చేస్తూ మంగళవారం పోటీకి దిగారు. అయితే, లిబరల్ పార్టీ మద్దతుతో టర్న్‌బుల్ గట్టెక్కారు. కేవలం 13 ఓట్ల తేడాతో డట్టన్ ఓడిపోయారు.
ఓటమి అనంతరం డట్టన్ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.
ఒకవేళ టర్న్‌బుల్ పదవి నుంచి దిగిపోయనా డట్టన్ పార్టీ కోశాధికారి స్కాట్ మొర్రిసన్ రూపంలో మరో ప్రత్యర్థిని ఎదర్కోవాల్సి ఉంటుందని స్థానిక మీడియా తెలిపింది.
టర్న్‌బుల్‌పై ఎందుకు వ్యతిరేకత?
పార్టీలోని సీనియర్ నేతలు ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన పేలవ ప్రదర్శన కనబర్చారు.
ఇంధన, వాతారణ విధానంపై ఆయన తీసుకున్న నిర్ణయాలు అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో పార్టీలోని నేతలను బుజ్జగించేందుకు సోమవారం ఉద్గారాలను తగ్గించే ప్రణాళికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకు పెద్దగా మద్దతు లభించలేదు.
విపత్కర పరిస్థితుల్లో టర్న్‌బుల్ పదవి నుంచే దిగిపోయే అవకాశం కనిపిస్తుందని ఆస్ట్రేలియాలోని బీబీసీ ప్రతినిధి గ్రిఫిత్ విశ్లేషించారు.
ఆస్ట్రేలియాలో నాయకత్వ సంక్షోభం నెలకొనడం కొత్తేమీ కాదు. పార్టీలోని ప్రత్యర్థుల వల్ల గతంలో ముగ్గురు ప్రధానులు పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
ఈ డట్టన్ ఎవరు?
బ్రిస్బేన్‌కు చెందిన డట్టన్ 2001లో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ శాఖలో ఆయన 9 ఏళ్లు పనిచేశారు.
2014 వలస చట్టం అమలుకు ముందు ఆరోగ్య, క్రీడలుతో పాటు అనేక శాఖలను ఆక్రమించుకున్నారు.
శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించకుండా నిరోధించే పలు విధానాలు తీసుకొచ్చారు.
ఆయన విధానాలను ఐక్యరాజ్యసమితి, మానవహక్కుల సంఘం విమర్శించాయి.
అధికారాల విస్తరణ
టర్న్‌బుల్ ప్రభుత్వంలో డట్టన్ అత్యంత సీనియర్ నాయకుడు.
గతేడాది మంత్రిగా మరిన్ని విస్తృత అధికారాలను సొంతం చేసుకొన్న ఆయన పార్టీలో బలమైన వ్యక్తిగా మారారు. టర్న్‌బుల్‌కు పోటీగా తయారయ్యారు.
''డట్టన్ బలమైన, సమర్థవంతమైన పాలకుడని'' ఆస్ట్రేలియాను సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో ఒకరైన జాన్ హోవార్డ్ అభివర్ణించారు.
''అతను తాను చెప్పదల్చుకున్న అంశాన్ని స్పష్టంగా చెబుతారు. సమర్థవంతమైన రీతిలో ప్రభుత్వ విధానాలను తీసుకొస్తారు'' అని పేర్కొన్నారు.
శరణార్థుల పట్ల కఠిన వైఖరి
టర్న్‌బుల్‌తో పోల్చితే డట్టన్ కరుడగట్టిన సంప్రదాయవాది. ముఖ్యంగా శరణార్థులుగా ఆస్ట్రేలియాకు వస్తున్నవారిపై కఠిన విధానాలు అమలు చేస్తున్న వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
ఇవి కూడా చదవండి
- కేరళ వరదలు: విదేశీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు?
- తాజ్‌మహల్: కళ్లు తెరవకుంటే కనుమరుగే
- అనధికారిక ఖాతాల ఏరివేతలో ఫేస్‌బుక్, ట్విటర్
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- వైరల్ ఫొటో: ‘స్కూల్ టూర్ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే... అక్కడ నానమ్మ కనిపించింది’
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)