You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆస్ర్టేలియాలో మొదటి గే మ్యారేజ్
అర్ధరాత్రి దాటిందో లేదో, 'ఐ డూ' అని చెప్పేవారిలో ముందుంటూ... క్రెయిగ్, లూక్.. తమ పెళ్ళి వాగ్దానాలను ఇచ్చి పుచ్చుకున్నారు.
వీరు ఈ సంవత్సరం కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొంటామని ఆశిస్తున్న ఆటగాళ్లు.
ఇక్కడ ఏళ్ళ తరబడి జరిగిన చర్చల్లో అంగీకారం కుదరకపోయినా గతేడాది నిర్వహించిన ఓటింగ్ లో గే వివాహాలను చట్టబద్ధం చేశారు.
డిసెంబర్ లో కొత్త చట్టాన్ని ఆమోదించాక, జంటలు, తమ పెళ్ళిళ్ళ కోసం 30 రోజుల అధికారిక నోటీస్ ఇవ్వడం మొదలుపెట్టారు.
అంతకంటే ముందే పెళ్ళి చేసుకునేందుకు కూడా కొన్ని జంటలకు మినహాయింపు ఇచ్చారు.
అయితే.. కైలీ, లీసాల జంటకు చట్టబద్ధంగా ఒక్కటయ్యేందుకు ఇప్పుడు అవకాశం దక్కింది.
వారి కుమార్తె ఇస్లా పెళ్ళిలో సందడి చేసింది.
అయితే వివాహానికి కొత్త నిర్వచనాలను అంగీకరించబోమని అనే వాళ్ళూ ఉన్నారు.
మూడోవంతుకు పైగా ఓటర్లు చట్టంలో మార్పునకు అంగీకరించలేదు.
జెండర్, సెక్స్ ఎడ్యుకేషన్ లపై స్కూళ్ళలో చేసే బోధనలో మార్పులు వస్తాయని కొన్ని మతపరమైన సంస్ధలు అంటున్నాయి.
అయితే చట్టం దృష్టిలో సమానత్వం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసిన జంటలు మాత్రం తమ పెళ్ళి రోజు నుంచి దృష్టి మళ్ళించడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు.
ఇవి కూడా చదవండి:
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- ఇరానీ చాయ్‌తో సమోసా ఎందుకు తింటారంటే..
- దుబాయ్: మీరు చూడని కోణాలు.. కొత్త మంత్రిత్వ శాఖలు
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- మీ పిల్లలు స్మార్ట్‌వాచీలు వాడుతున్నారా? కాస్త జాగ్రత్త!
- ‘బ్లూ వేల్’ బూచి నిజమేనా?
- ‘వన్నాక్రై సైబర్ దాడి చేసింది ఉత్తర కొరియానే’
- బ్లూ స్క్రీన్ వచ్చిందా! మరేం భయం లేదు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)