జపాన్‌లో వరద మిగిల్చిన విషాదానికి ఈ ఫొటోలే నిదర్శనం

కుండపోత వర్షాలతో పశ్చిమ జపాన్ ప్రాంతం అతలాకుతలమైంది.

భారీ వరదలతో పాటు.. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం తెలిపింది. మరో 50 మందికి పైగా గల్లంతయ్యారు.

జపాన్‌లో గత మూడు దశాబ్దాల కాలంలో వర్షాల వల్ల ఇంత భారీగా ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి.

లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు నీటిలో మునిగిపోయాయి. పలు ఇళ్లు కూలిపోయాయి.

అనేక నివాసాలకు నీటి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో 70,000 మంది అత్యవసర సహాయక సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది.

రహదారులు కోతలకు గురయ్యాయి. అనేక వాహనాలు బురదలో చిక్కుకుపోయాయి. కొన్ని చోట్ల ఘాట్ రోడ్లు తెగిపోయాయి.

గత గురువారం నుంచి ఇప్పటి వరకు జూలైలో నమోదవ్వాల్సిన సాధారణ వర్షపాతం కంటే మూడు రెట్ల అధికంగా వర్షం కురిసింది.

లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ ప్రాంతంలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వరదల నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో అబే తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)