ఆరు దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడ బౌద్ధమతంలోకి మారుతున్నారు
భీమ్ రావ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న ఉదయం సుమారు తొమ్మిదిన్నరకు త్రిశరణ్, పంచశీల్ పంక్తులను వల్లించి బౌద్ధ మతం స్వీకరించారు.
తర్వాత ఈ బుద్ధుడి ప్రతిమ మెడలో పూలమాల వేశారు. దాని ముందు మూడుసార్లు ప్రణమిల్లారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఇతర హిందూ దేవతల పేర్లు చెబుతూ వారిపై నమ్మకం ఉంచబోనని, వారిని పూజించబోననంటూ 22 సంకల్పాలను చదివారు.
22 సంకల్పాల్లో మొదటి ఐదు హిందు దేవతలకు సంబంధించినవి. ఇప్పుడు కూడా బౌద్ధం స్వీకరించాలనుకునేవారు దీక్ష తీసుకుంటున్నప్పుడు వాటిని వల్లిస్తారు.
అంబేడ్కర్ బౌద్ధం స్వీకరించిన చోట ఉన్న ఈ 14 ఎకరాల మైదానాన్ని ఇప్పుడు దీక్షా భూమిగా పిలుస్తున్నారు.
1956 అక్టోబర్ 14కు గుర్తుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తారు. రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. బౌద్ధ మత దీక్ష చేపడతారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీ ప్రభుత్వం-బైజూస్ ఒప్పందం: విద్యార్థులు స్మార్ట్ఫోన్తో బడికి వెళ్ళాలని ఆదేశాలు... ఇంకా రాబోయే మార్పులేంటి?
- మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- టీ తాగడం భవిష్యత్తులో కష్టమవుతుందా, తేయాకు దిగుబడి తగ్గడానికి కారణాలేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)