గుజరాత్: స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి ఆ ఊరు బస్సు వచ్చింది, గ్రామమంతా తిప్పి పండగ చేసుకున్నారు

వీడియో క్యాప్షన్, గుజరాత్: స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి ఆ ఊరు బస్సు వచ్చింది, గ్రామమంతా తిప్పి పండగ చేసుకున్నారు

గుజరాత్‌లోని తాపీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్లకు మొదటిసారి ప్రభుత్వ బస్సు వచ్చింది.

ఈ గ్రామం... ఆదివాసులు ఎక్కువగా ఉండే మారుమూల ప్రాంతంలో ఉంటుంది.

ఎన్నో ఏళ్ల కల నెరవేరడడంతో ఊరంతా కలిసి పండగ చేసుకుంది.

బస్సుకు దండలు వేసి, పూలతో అలంకరించి ఊరంతా తిప్పుతూ సంబరాలు చేసుకున్నారు గ్రామస్థులు.

వాళ్ల సంబరాల వీడియోలు వైరల్ అయ్యాయి.

బీబీసీ ప్రతినిధులు నీరవ్ కన్సారా, దేవేశ్ సింగ్ అందిస్తున్న కథనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)