korean restaurants: రాయలసీమలో కొరియా రుచులు

వీడియో క్యాప్షన్, రాయలసీమలో కొరియా రుచులు

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోటర్స్ రాకతో పెనుగొండ స్వరూపం మారిపోయింది.

ఇక్కడ వచ్చిన మార్పుల్లో ఒకటి - ఈ రెస్టారెంట్ ఏర్పాటు. పెనుకొండలో కొరియా వంటకాలు అందించే నాలుగు కొరియన్ రెస్టారెంట్లలో ఇది ఒకటి.

కొరియన్ల కోసం ఈ రెస్టారెంట్ల వాళ్లు కోళ్లు, బాతులను పెంచుతున్నారు. కొరియన్లు ఇష్టపడే ఆకు కూరలు, కూరగాయలు తెప్పిస్తుంటారు. ఇక్కడ వంటకాల్లో నువ్వుల నూనె వాడతారు.

కొరియా వంటకాలు రుచి చూసేటపుడు కించీతో మొదలుపెడతారు. క్యాబేజీ, రకరకాల కూరగాయలతో తయారు చేసే ఈ కించీ రుచిగా, స్పైసీగా ఉంటుందని ఇక్కడి కొరియన్లు చెబుతుంటారు.

కొరియన్లు సీఫుడ్‌ బాగా ఇష్టపడతారు. ఇందులో రొయ్యలు, ఆల్చిప్పలు, స్క్విడ్ లాంటివి ఉంటాయి.

సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెస్టారెంట్ కళకళలాడుతూ ఉంటుంది. ఈ రెస్టారెంట్లలో సిబ్బంది, వంటవాళ్లు కొరియన్లే ఉంటారు. వారికి సహాయకులుగా భారతీయులు ఉంటారు.

సౌత్ కొరియాకు చెందిన గ్రేస్ పెనుకొండలోని షిల్రా హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.ఈ రెస్టారెంట్లలో కస్టమర్లు లోపలికి రాగానే చెప్పుల స్టాండ్ దగ్గర బూట్లు, చెప్పులు వదిలేసి, ఫ్లిప్-ఫ్లాప్‌లు వేసుకుంటారు. కొరియన్లు వారాంతాల్లో ఇక్కడ స్నేహితులతో కలిసి పార్టీలు కూడా చేసుకుంటారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)