బీబీసీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: కశ్మీర్‌లో శాంతి కోసం పాకిస్తాన్‌తో చర్చించేదే లేదన్న జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.

వీడియో క్యాప్షన్, ఏదైనా ఉంటే స్థానికులతోనే చర్చిస్తామన్నారు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.

కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో చర్చించేదేమీ లేదని.. ఏదైనా ఉంటే స్థానికులతోనే చర్చిస్తామన్నారు జమ్మకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.

ఆర్టికల్ 370 తొలగింపు, జమ్ములో పండిట్లపై దాడులు, కశ్మీర్ అంశంపై చర్చలు, లోయలో ఎన్నికల నిర్వహణతో పాటు పాటు అనేక అంశాలపై బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

కశ్మీర్‌లో యువకులు రాళ్లు రువ్వడాలు, ఆందోళనలు ఆగిపోయాయని లెఫ్టినెంట్ గవర్నర్ ఇటీవల తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తెలిపారు.

లోయలో స్వేచ్ఛ లేదన్న ఆరోపణలపైన, కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపైనా ఆయన మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)