ఉజ్వల పథకం: వంట గ్యాస్‌ వాడకం ఆపేసి, మళ్లీ కట్టెల పొయ్యికి మొగ్గు చూపుతున్న నిరుపేద కుటుంబాలు

వీడియో క్యాప్షన్, వంట గ్యాస్‌ వాడకం ఆపేసిన మహారాష్ట్ర ఆదివాసులు.. మళ్లీ కట్టెల పొయ్యి వైపు గ్రామీణులు

వంటగదిలో ఉక్కిరిబిక్కిరి చేసే పొగ నుంచి నిరుపేద మహిళలకు విముక్తిని ప్రసాదించే లక్ష్యంతో 2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.

ఆ పథకం కింద, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, స్టవ్‌లతో పాటు నింపిన గ్యాస్ సిలిండర్ ఇచ్చారు.

అయితే, ఆనాడు సిలిండర్ ధర 527 రూపాయలు. ఈ ఆరేళ్లలో, దాని ధర దాదాపు రెట్టింపై ఇప్పుడు 11 వందల రూపాయలకు చేరుకుంది. దానికి తోడు నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటాయి.

మరిప్పుడు నిరుపేద కుటుంబాలు సిలిండర్లు రీఫిల్ చేయించుకోగలుగుతున్నాయా?

మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో ఓ ఆదివాసీ గ్రామం నుంచి బీబీసీ ప్రతినిధి నితేష్ రావుత్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)