You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Swiggy Horse Rider : గుర్రం మీద ‘స్విగ్గీ డెలివరీ’... నెటిజన్లను ఫిదా చేసిన ఆ కుర్రాడు ఇతనే..
స్విగ్గీ డెలివరీ బ్యాగ్ తగిలించుకుని వానలో గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో ఇటీవల బాగా వైరల్ అయింది.
గుర్రం మీద డెలివరీ చేయడం ద్వారా పర్యావరణానికి మేలు చేస్తున్నారంటూ కొందరు కామెంట్ చేస్తే... అంత వానలోనూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడంటూ చాలా మంది ప్రశంసించారు.
ఇక ఇదంతా పబ్లిక్ స్టంట్ అంటూ స్విగ్గీని విమర్శించిన వారు ఉన్నారు. మరికొందరు డెలివరీ పేరుతో జంతువులను హింసించకండి అంటూ ట్వీట్లు చేశారు.
ఈ నేపథ్యంలో దీని మీద స్విగ్గీ తాజాగా వివరణ ఇచ్చింది. గుర్రం మీద స్విగ్గీ డెలివరీ బ్యాగ్ తగిలించుకొని పోతున్న వ్యక్తి తమ కంపెనీ కోసం పని చేసే డెలివరీ ఎగ్జిక్యూటివ్ కాదని తెలిపింది.
డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌లు ఎలాంటి పరిస్థితుల్లో పని చేస్తున్నారో ఈ వీడియో తెలియజేస్తోందంటూ చర్చ కూడా జరిగింది. ఇలాంటి డెలివరీ జాబ్స్ చేసే వారి అసహాయతను క్యాష్ చేసుకుంటూ వారి చేత సంస్థలు ఎక్కువ పని చేయించుకుంటున్నారనే విమర్శలు కూడా వచ్చాయి.
ఈ విమర్శల నేపథ్యంలో ఆ వ్యక్తి, గుర్రం జాడ తెలిపిన వారికి రివార్డ్ ఇస్తామని జులై 5న స్విగ్గీ ప్రకటించింది.
చివరకు ఆ గుర్రం, దాని మీద స్వారీ చేసిన వ్యక్తి వివరాలు తెలిశాయంటూ ఆదివారం ఒక స్టేట్‌మెంట్ ట్వీట్ చేసింది స్విగ్గీ.
ఆ స్టేట్‌మెంట్ ప్రకారం...
గుర్రపు స్వారీ చేస్తున్న వ్యక్తి ఎవరు?
వీడియోలో కనిపించినట్లు గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి పేరు సుశాంత్. వయసు 17. పక్కనోళ్ల వస్తువులు తీసుకుని, తిరిగి ఇవ్వడం మరచిపోతుంటాడు. ఈ కేసులో స్విగ్గీ డెలివరీ బ్యాగ్ తీసుకున్నాడు.
సుశాంత్ ఏం చేస్తుంటాడు?
ముంబయిలో గుర్రాలను అలంకరించే పని చేస్తుంటాడు సుశాంత్. పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి వాటికి గుర్రాలను డెకరేట్ చేస్తుంటాడు. తాను రైడ్ చేసిన గుర్రం పేరు శివ.
తగిలించుకున్న స్విగ్గీ బ్యాగ్‌లో ఏముంది?
ఒక పెళ్లికి గుర్రాన్ని అలంకరించేందుకు అవసరమైన డిజైనింగ్ బట్టలు, ఇతర సామాగ్రి అందులో ఉన్నాయి.
ఎవరు వీడియో తీశారు?
అవీ అనే కుర్రాడు, అతని మిత్రుడు ఈ వీడియో షూట్ చేశారు. సుశాంత్ వివరాలు తెలిపినందుకు వారికి 5,000 స్విగ్గీ మనీ బహుమతిగా లభించింది.
మొత్తానికి కొందరు స్విగ్గీ డెలివరీ ఐకాన్‌ను గుర్రంగా మార్చి మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- పండర్‌పుర్ వారీ: ‘పీరియడ్స్ అనేవి పాండురంగడు ఇచ్చినవే. అవన్నీ ఆయనకే చెందుతాయి’
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- సీఐ నాగేశ్వర రావు అరెస్ట్, వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో విచారిస్తున్న పోలీసులు
- వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)