కాకినాడ జిల్లా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న రాయల్ బెంగాల్ టైగర్
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమల వెంబడి పలు ప్రాంతాల్లో ఇటీవల పులి జాడలు స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఆ పులి పలు జీవులను వేటాడడంతో సమీప పల్లెల్లో కలకలం కనిపిస్తోంది. రాత్రి వేళల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పులి సమాచారం తెలిసిన నాటి నుంచి దాదాపు 15 రోజులుగా కాకినాడ జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ కొనసాగుతోంది. వివిధ ప్రయత్నాలు చేసినా పులి పట్టుబడడం లేదు. రాయల్ బెంగార్ టైగర్‌గా అధికారులు దీనిని నిర్ధరించారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో పులి భయంతో కనిపిస్తున్న కొన్ని గ్రామాల్లో బీబీసీ పర్యటించింది. పులి కోసం చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతోందన్నది తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఇవి కూడా చదవండి:
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అలర్జీ అంటే ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
- వయసు పెరగకుండా చరిత్రలో జరిగిన ప్రయోగాలేంటి... తాజాగా సైన్స్ కనిపెట్టింది ఏమిటి?
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)