Jana Gana Mana: ఒక ఎన్‌కౌంటర్ కథ - ఎడిటర్స్ కామెంట్

వీడియో క్యాప్షన్, జనగణమన: అవసరమైన ప్రశ్నలను రేకెత్తించిన సినిమా - ఎడిటర్స్ కామెంట్

మరాఠీ క్లాసిక్ సినిమా కోర్ట్ మాదిరి ఇది సటిల్, రియల్, మూవీ కాదు. దిసీజ్ లౌడ్ అండ్ డ్రమెటిక్. కానీ, ముఖ్యమైన సినిమా. వర్తమాన సందర్భంలో అవసరమైన సినిమా. ఆలోచింపజేసే సినిమా.

రాజ్యాంగ స్ఫూర్తి పౌరహక్కులు వ్యవస్థలు పనిచేసే విధానం, ఎదుటివారిపై మనలో మనకు తెలీకుండానో తెలిసో గడ్డకట్టుకుని ఉండే దురభిప్రాయాలు వీటన్నింటిని చర్చించే సినిమా. మనల్ని కుదురుగా ఉండనివ్వక ఛాలెంజ్ చేసే సినిమా. అందుకు ఈ సినిమా ముఖ్యమైన సినిమా.

ఒక అమ్మాయిని అత్యాచారం చేసి తగులబెట్టేశారని నలుగురు కుర్రాళ్లను పట్టుకుని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపడం, దానికి సమాజంలో విపరీతమైన ప్రశంసలు రావడం మనం చూసి ఉన్నాం. తర్వాత విచారణ కమిటి అది బూటకపు ఎన్కైంటర్ అనేది తేల్చి చెప్పడం కూడా చూసి ఉన్నాం.

అలాగే సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యను చూసి ఉన్నాం. అది విద్యార్థుల్లో రేపిన అలజడి ఆ సంద్భంగా జరిగిన ఉద్యమం, దాని చుట్టూ సాగిన రాజకీయాలుఅవ్వన్నీ చూసి ఉన్నాం. ఇదిగో ఈ రెండు అంశాల్ను గుర్తుచేస్తూ మౌలిక మైన విషయాలను చర్చించిన మూవీ. అందువల్ల తెలుగు సమాజానికి అత్యంత సన్నిహితమైన సినిమా ఇది.ఇన్ స్టాంట్ న్యాయంతో ఉండే ప్రమాదాన్ని ఇది చర్చిస్తుంది. ఇన్ స్టంట్ కాఫీ ఇన్ స్టంట్ టీ మాదిరి ఇన్ స్టంట్ జస్టిస్ కావాలనుకునే ధోరణి ఎంత ప్రమాదకరమనేది ఫవర్ ఫుల్గా చూపించే ప్రయత్నం చేశారు.

అన్నింటిని మించి ఇందులో దళిత స్టూడెంట్ కష్టపడి పరిశోధనలు చేసి అనేక ప్రతిష్టాత్మక జర్నల్స్లో పబ్లిష్ చేసినా పీహెచ్‌డీకి గైడ్ సహకకరించకపోగా అతనొక కీలకమైన స్టేట్మెంట్ ఇస్తాడు. పక్కనున్న స్వీపర్‌ని చూపిస్తూ 'వాళ్ల తల్లి స్వీపర్ ఆమె కూతురు కూడా ప్వీపరే కావాలి. వాళ్లకేదైనా అవసరమైతే మేం సాయం పడేస్తం. మీ ఎదగుదల ఏదైనా మా ఔదార్యం కావాలి. అది మీ హక్కు కాదు. అది మా ఔదార్యం.'

ఔదార్యం అనేది పైనుంచి కిందకు చేసే సాయం. అది పై వాళ్లు కింది వాళ్లు అనే తేడాలను ఛాలెంజ్ చేయదు. పరోక్షంగా యధాతథ స్థితికి ఉపయోగపడుతుంది. హక్కు అట్లా కదు. అది ఆధునిక విలువ. మనుషులను సమానులుగా చూసేందుకు ఏర్పరుచుకున్న విలువ. ఈ పాయింట్ ని పవర్ పుల్గా ప్రెజెంట్ చేసినందుకైనా సినిమా చూడాలి.

ఇంకా, ఈ సినిమా చర్చించిన కీలక అంశాలేంటి, అలాగని ఇందులో లోపాలు లేకపోలేదా...? పూర్తి రివ్యూ కోసం వీడియో చూడండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)