తాజ్‌మహల్‌ బేస్‌మెంట్లో మూసేసిన ఆ 22 గదుల్లో దాగిన రహస్యాలేంటి?

వీడియో క్యాప్షన్, తాజ్‌మహల్‌ బేస్‌మెంట్లో మూసేసిన ఆ 22 గదుల్లో దాగిన రహస్యాలేంటి?

భారత్‌లోని ఒక హైకోర్టులో ఈ అంశంపై దాఖలైన పిటిషన్ కొట్టివేశారు. తాజ్‌మహల్‌లో శాశ్వతంగా మూసి ఉంచిన 20కి పైగా గదులను తెరిచి, వాటిలోని వాస్తవ చరిత్రను పరిశోధించాలంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక సభ్యుడు పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఈ మూసి ఉన్న గదుల్లో శివుడికి సంబంధించిన ఆలయం ఉందని చరిత్రకారులు, ఆరాధకులు చేస్తున్న వాదనల్లో నిజానిజాలు తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు కోర్టుకు పిటిషనర్ రజనీశ్ సింగ్ తెలిపారు.

ఆగ్రాలోని యమునా నది తీరాన 17వ శతాబ్దంలో నిర్మించిన సమాధి తాజ్ మహల్. తమ 14వ బిడ్డకు జన్మినిస్తూ మరణించిన భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇటుక, ఎర్రని ఇసుకరాయి, పాలరాతితో ఈ స్మరకాన్ని నిర్మించారు.

ఎన్నో విశేషాలున్నతాజ్ మహల్ భారత్‌లో అతిపెద్ద పర్యాటక ఆకర్షణ కూడా. కానీ రజనీశ్ సింగ్ మాత్రం... మూసి ఉన్న ఆ గదుల వెనుక చరిత్రను మనమందరం తెలుసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. రజనీశ్ సింగ్ తెరవాలని కోరుతున్న చాలా గదులు తాజ్ మహల్ బేస్ మెంట్లో ఉన్నాయి. ఇంతకీ ఆ గదుల్లో ఏముంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)