హైదరాబాద్ దళిత యువకుడి హత్య: ‘ఇస్లాం ప్రకారం ఇది చాలా పెద్ద నేరం’ - అసదుద్దీన్ ఒవైసీ

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ దళిత యువకుడి హత్య: ‘ ఇస్లాం ప్రకారం ఇది చాలా పెద్ద నేరం’ - అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్‌లో ముస్లిం యువతి ఆశ్రీన్‌ను పెళ్లి చేసుకున్న హిందూ యువకుడు నాగరాజు హత్యను మజ్లీస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

‘‘మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇద్దరు ముస్లింల మధ్య వివాహం జరిగితేనే అది నిఖా అవుతుంది. షరియత్ చట్టం కింద వస్తుంది.

హిందూ వివాహ చట్ట ప్రకారం హిందువుల మధ్య వివాహం జరిగితేనే అది లీగల్ అవుతుంది.

ఇక్కడ ఆ అమ్మాయి తనకు నచ్చినవాడిని పెళ్లిచేసుకుంది. చట్ట ప్రకారం ఆమెకు ఆ హక్కు ఉంది.

కానీ, ఆమె భర్తను చంపే ఎలాంటి హక్కూ ఆమె సోదరుడికి లేదు. అది చట్ట ప్రకారం నేరం.

ఇస్లాం ప్రకారం చాలా పెద్ద నేరం.

ఎందుకు ఆ అబ్బాయిని చంపారు? ఈ చర్యను బహిరంగంగా ఖండిస్తున్నాను.

మీకు నచ్చలేదంటే, మీరు ముఖం తిప్పుకొని వెళ్లిపోండి. కానీ, మీరు నేరం చేశారు, తప్పు చేశారు.

మజ్లీస్ దీన్ని ఖండిస్తుంది.

ఒక వ్యక్తిని చంపితే, మొత్తం మానవత్వాన్నే చంపినట్టు. ఒక అమాయకుడి ప్రాణం కాపాడితే, మానవత్వాన్ని కాపాడినట్టు’’ అని అసదుద్దీన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)