ఆచార్య‌ రివ్యూ: కొరటాల శివ, చిరంజీవి సినిమా.. పాఠమా? గుణపాఠమా?

వీడియో క్యాప్షన్, ఆచార్య‌ రివ్యూ: కొరటాల శివ, చిరంజీవి సినిమా.. పాఠమా? గుణపాఠమా?

చిరంజీవి అంటే 152 సినిమాల చ‌రిత్ర‌. నాలుగు ద‌శాబ్దాల అలుపెర‌గ‌ని ప్ర‌యాణం. బాక్సాఫీస్ రికార్డులు. చిరు సినిమా వ‌స్తోందంటే.. పండ‌గ‌లాంటి వాతావ‌ర‌ణం, ఉర‌కలెత్తే ఉత్సాహం క‌నిపిస్తుంది.

అది... ఇన్నేళ్లుగా చిరంజీవి సంపాదించుకున్న న‌మ్మ‌కం. దానికి కొర‌టాల శివ జ‌త క‌లిశారు. ఫ్లాపులెర‌గ‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల‌. త‌న క‌థ‌లు, అందులోని పాత్ర‌లు, సంఘ‌ర్ష‌ణ‌.. ఇవ‌న్నీ బ‌లంగా ఉంటాయి. కాబ‌ట్టే - కొర‌టాల‌కు హిట్లు వ‌రుస‌క‌ట్టాయి.

అవి చూసే స్టార్లు కొర‌టాల‌ని పిలిచి మ‌రీ అవ‌కాశాలు ఇచ్చారు. చిరు కూడా అంతే. ఫ‌లిత‌మే `ఆచార్య‌`. దాదాపు మూడేళ్ల పాటు సాగిన ప్రాజెక్ట్ ఇది.

చిరు - కొర‌టాల కాంబో.. దానికి తోడు రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషించ‌డం, ఆర్‌ఆర్‌ఆర్ త‌ర‌వాత చ‌ర‌ణ్ నుంచి వ‌చ్చిన సినిమా ఇదే కావ‌డంలో `ఆచార్య‌` చుట్టూ బ‌జ్ ఏర్ప‌డింది.

సుదీర్ఘ విరామం త‌ర‌వాత‌ ఆచార్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? అంచ‌నాల్ని అందుకుందా? అంద‌కుండా పోయిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)