గాయపడిన, జబ్బుపడిన పక్షులకు పంజాబ్‌‌లోని ఫరీక్‌కోట్‌లో ఒక కుటుంబం ఉచితంగా చికిత్సస్తోంది.

వీడియో క్యాప్షన్, గాయపడిన, జబ్బుపడిన పక్షులకు పంజాబ్‌‌లోని ఫరీక్‌కోట్‌లో ఒక కుటుంబం ఉచితంగా చికిత్సస్తోంది.

గాయపడిన, జబ్బుపడిన పక్షులకు పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందిన శంకర్‌ శర్మ ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

తన కుటుంబం మొత్తం పక్షుల సంరక్షణకు సాయం చేస్తోందని ఆయన చెబుతున్నారు.

పెంపుడు పక్షులు గాయపడితే యజమానులు వాటిని తీసుకొచ్చి శంకర్‌ ఇంట్లో వదిలి వెళ్తారు.

శంకర్‌ వాటికి చికిత్స చేసి, అవి కోలుకున్నాక తీసుకెళ్లి అడవిలో వదిలిపెడతారు.

వృత్తి రీత్యా అకౌంటెంట్‌గా పనిచేసే శంకర్‌ శర్మకు పక్షులతో ప్రత్యేక అనుబంధం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)