పసిపిల్లలకు ఎప్పుడు ఏం తినిపించాలి, ఏం తినిపించకూడదు

వీడియో క్యాప్షన్, పసిపిల్లలకు ఎప్పుడు ఏం తినిపించాలి, ఏం తినిపించకూడదు?

మందులే అన్నిటికీ పరిష్కారం అనుకుంటారు. పిల్లల పోషణ గురించి చాలామందికి అవగాహన శూన్యం. చదువు, సంపాదన, ప్రాంతాలకి అతీతం ఈ అవగాహనారాహిత్యం.

అప్పుడే పుట్టిన బిడ్డ నుండీ "అమ్మా అన్నం పెట్టు" అని పిల్లలే అడగగలిగే వయసు వరకూ వారి పోషణ ఎలా ఉండాలో చూద్దాం.

బిడ్డ పుట్టిన ఒక గంటలోపే తల్లిపాలు పట్టాలి. ఆ తర్వాత ప్రతి రెండు గంటలకొకసారి తల్లిపాలే పట్టాలి. మొదటి ఆరు నెలలూ అదే బిడ్డకు ఆహారం.

అయితే ఈ విషయంలో తరచూ బిడ్డతల్లులు అడిగే ప్రశ్నలు -

"బాగా ఎండాకాలం కదా, కొన్ని నీళ్లు పట్టొచ్చా?!"

"పాలు అరగట్లేదేమో? గ్రైప్ వాటర్ పట్టొచ్చా?!"

"పిల్లాడికి విరేచనాలు అవుతున్నాయ్, మా బామ్మ పాలు ఇవ్వొద్దంది ఈ పూట".

"బాదం, జీడిపప్పు లాంటివి మిక్సీ పట్టి పాలలో కలిపి ఇవ్వొచ్చా?!"

పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే తప్పులేమిటి? పసిపిల్లలకు ఎప్పుడు ఏం తినిపించాలి, ఏం తినిపించకూడదు?పూరకాహారం అంటే అందులో ఏమేం ఉంటాయి.. ఈ వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)