దున్నపోతు భయంతో 10 రోజులుగా ఊరంతా చెట్లపైనే జీవనం

వీడియో క్యాప్షన్, దున్నపోతు భయంతో 10 రోజులుగా ఊరంతా చెట్లపైనే జీవనం

ఒక పొగరుబోతు దున్న సృష్టించిన బీభత్సం కారణంగా గుజరాత్‌లోని ఓ గ్రామ ప్రజలంతా గత 10 రోజులుగా చెట్లపైనే నివసిస్తున్నారు. అక్కడే భోజనం, నిద్ర.

వడోదర జిల్లా మహీసాగర్ నదీతీరంలోని డబ్కా గ్రామ ప్రజలకు ఈ పరిస్థితి ఎదురైంది.

ఈ దున్నపోతు గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి అందరం భయంతో బతుకుతున్నామని.. అది తమ గేదెలపైనా దాడి చేస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.

గేదెలను మేతకు తీసుకువెళ్లడానికి, పాలు పితకడానికి కూడా అవకాశం దొరకడం లేదని... ఆ దున్న ఎటు నుంచైనా వచ్చి దాడి చేస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)