వయసు 100 ఏళ్లకు చేరువవుతున్నా.. బావుల్లోకి దూకి ఈతకొడుతున్న బామ్మ
వయసు వందేళ్లకు చేరువవుతున్నా.. ఆమె నేల బావుల్లోకి అలవోకగా దూకి ఈతకొడతారు. తమిళనాడుకు చెందిన పప్పమ్మాళ్ ఇప్పటికే వంద మందికి పైగా ఈతలో ఎన్నో మెళకువలు నేర్పారు.
''మా నాన్న బట్టలు ఉతికేవాడు. నేను ఒక చేతిలో వెదురుబొంగును పట్టుకుని మరో చేతితో ఈదేదాన్ని. అలా కొద్ది రోజుల్లోనే ఈత నేర్చుకున్నాను. ఆ తర్వాత నా అంతట నేనే నీళ్లలో దూకి బయటకు రాగలిగాను. చాలా ఎత్తు నుంచి కూడా దూకగలను, ఈజీగా పైకి వచ్చేయగలను. చిన్నప్పుడు నేను పెద్ద పెద్ద బావుల్లో దూకుతూ ఈత కొడుతుండేదాన్ని. నేను నేర్చుకున్నా కాబట్టి, నా పిల్లలకు, చెల్లెళ్లకు, చేలల్లో పని చేసేవాళ్లకు కూడా నేర్పించాను. వాళ్ల జుత్తు పట్టుకుని ఈదమని చెప్పేదాన్ని. నేను ఇప్పటికీ ఈదగలను. దీనికంతటికీ మా నాన్న ప్రోత్సాహమే కారణం. ఆయన నుంచి నేర్చుకున్న విద్యను నా పిల్లలకు, మనవళ్లకు, ఇరుగు పొరుగు వాళ్లకు నేర్పిస్తున్నాను. ఇప్పటికి వందమందికి పైగా నేర్పించాను. ఇంకా నేర్పిస్తాను'' అని బీబీసీతో అన్నారు తమిళనాడు వెన్నత్తూర్ రాశిపురంకు చెందిన పప్పమ్మాళ్ చెప్పారు.
పప్పమ్మాళ్ తన వయసు 85 అని చెబుతుండగా, రికార్డులలో మాత్రం 74 అని ఉంది.

''నేను చిన్నతనంలో ఈత నేర్చుకుంటుంటే, జనం అంతా నన్ను వింతగా చూసేవారు. కొంతమంది నన్ను చూసి నవ్వేవారు. కానీ, నేను ఇప్పటికీ డైవింగ్ చేయగలను. నా వయసు 85 సంవత్సరాలు. నేను ఈ వయసులో కూడా అలవోకగా ఈత కొడుతుంటే మా ఇరుగు పొరుగువారు చూసి ఆశ్చర్యపోతుంటారు.
ఈత నేర్చుకోవడం చాలామంచిది.
ఈత కొట్టడంలో అనేకరకాల మెలకువలు పిల్లలకు నేర్పిస్తుంటాను. చేతులు ఎలా కదపాలి, కాళ్లు ఎలా ఊపాలి, నీళ్ల మీద తేలుతూ ఉండటం ఎలా, మునగడం ఎలా...లాంటి టెక్నిక్కులు నేర్పుతుంటాను.
ఈత నేర్చుకుంటే మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఒక్కసారి నేర్చుకుంటే చనిపోయేదాకా మర్చిపోయేది కాదిది'' అన్నారు.
''బాగా ఈత కొట్టండి. ఆరోగ్యంగా ఉండండి'' అని చెబుతున్నారు ఈ బామ్మ.
ఇవి కూడా చదవండి
- తబ్లీగీ జమాత్ను సౌదీ అరేబియా ఏ భయం కారణంగా నిషేధించింది?
- ఇద్దరు మహిళల యధార్ధ గాథ: ‘పోర్న్ చూస్తూ అసహజ సెక్స్ కోసం బలవంతం చేసేవాడు, కాదంటే శిక్షించేవాడు’
- ‘కొన్ని కులాల మహిళలు వక్షోజాలు కప్పుకోరాదని ఆంక్షలు.. ఉల్లంఘిస్తే రొమ్ము పన్ను’
- జేమ్స్ వెబ్: విశ్వ రహస్యాలను వెలుగులోకి తెచ్చే టెలిస్కోప్ ఇదేనా
- ‘పెళ్లి తరువాత అమ్మాయి పేరు, ఇంటి పేరు మార్చాలా? అబ్బాయి పేరూ మారిస్తే’
- ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్ను కూడా కోల్పోవాల్సి ఉండేది’
- భీకర సుడిగాలికి ఎగిరిపోయిన పెళ్లి ఫొటోలు, సర్టిఫికేట్లు 225 కిలోమీటర్ల అవతల దొరికాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)