ఇథియోపియాలో టిగ్రే తిరుబాటుదారులు పైచేయి సాధించారా

వీడియో క్యాప్షన్, ఇథియోపియాలో టిగ్రే తిరుబాటుదారులు పైచేయి సాధించారా?

గత కొన్నేళ్లుగా ఇథియోపియా.. అక్కడి ఆర్థికాభివృద్ధి, ప్రజాస్వామ్య సంస్కరణల కారణంగా వార్తల్లో నిలిచింది.

కానీ, ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న టిగ్రే సంక్షోభం పరిస్థితిని మార్చింది. ఇథియోపియా ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటి.

ఉత్తర టిగ్రే ప్రాంతంలో ఏడాది పాటు కొనసాగిన పోరాటం తర్వాత ఇథియోపియా మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ఈ సంక్షోభంలో కొన్ని వేల మంది మరణించారు, కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు, వేలాది మంది కరవులో కొట్టుమిట్టాడుతున్నారని సహాయ సంస్థలు చెబుతున్నాయి.

ఇటీవల రాజధాని ఆడిస్ అబాబాకు 400 కిలోమీటర్ల దూరంలోనున్న రెండు నగరాలను టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్(టీపీఎల్ఎఫ్) స్వాధీనం చేసుకుందని వచ్చిన వార్తల నేపథ్యంలో ఇథియోపియా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రజలంతా ఆయుధాలు అందుకోవాలని కోరింది.

ఈ పరిస్థితి ఇథియోపియాతో పాటు పొరుగు దేశాల భవిష్యత్తుపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)