కేరళ వరదలు: పెళ్లి మండపానికి వంటపాత్రలో వెళ్లిన కొత్త జంట

వీడియో క్యాప్షన్, కేరళ వరదలు: పెళ్లి మండపానికి వంటపాత్రలో

వరదలతో అతలాకుతలమైన కేరళలో పెళ్లి మండపానికి చేరుకోవడానికి వధూవరుల జంట ఒకటి పెద్ద వంట పాత్రలో కూర్చుని నీటిలో తేలుతూ వెళ్లాల్సి వచ్చింది.

ఈ ఫొటో, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేరళకు చెందిన ఆకాశ్, ఐశ్వర్యలు ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. వీరికి కొద్దిరోజుల కిందట పెళ్లి కుదిరింది. వరదల కారణంగా తమ పెళ్లి ఆగిపోకూడదని వారు అనుకున్నారు. వీరి పెళ్లి సోమవారం తలవడి గ్రామంలో జరిగింది.

వరదల కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో ఈ జంట ఒక పెద్ద గంగాళంలో(పాత్ర) కూర్చుని వరద నీటిలో వెళ్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)