You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Manmohan Singh: అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని -Newsreel
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఆయన నిన్నటి నుంచి జ్వరంతో బాధపడుతున్నారని, బలహీనంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఎయిమ్స్ అధికారులు తెలిపినట్లు ఏఎన్ఐ వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో మన్మోహన్ కోవిడ్ బారినపడ్డారు. తర్వాత ఆయన కోలుకున్నారు.
మన్మోహన్ సింగ్ సాధారణ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఏఐసీసీ సెక్రటరీ ప్రణవ్ ఝా తెలిపారు. వదంతులను నమ్మవద్దని కోరారు.
కాగా మన్మోహన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారన్న వార్త వచ్చిన కొద్దిసేపటికే పార్టీలకు అతీతంగా అనేక మంది నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్‌లు చేస్తున్నారు.
మాజీ ప్రధాని త్వరగా కోలుకోవాలని దేశమంతా కోరుకుంటోందని, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తోందని కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా పేర్కొంది.
తగ్గనున్న వంట నూనెల ధరలు
వంట నూనెల ధరలు దిగి వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముడి పామాయిల్, సోయా బీన్, సన్ ఫ్లవర్ ఆయిల్‌లపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించింది.
దీంతో పాటు వీటిపై అగ్రి సెస్ కూడా తగ్గించింది. ఈ మార్పులతో వంట నూనెల ధరలు కొంత తగ్గనున్నాయి.
ముడి పామాయిల్‌పై అగ్రిసెస్ 7.5 శాతానికి, ముడి సోయా బీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్‌లపై 5.5 శాతానికి తగ్గించారు.
రిఫైన్డ్ ఆయిల్‌లపై బేసిక్ కస్టమ్స్ సుంకం 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించారు.
రేపటి నుంచి(అక్టోబర్ 14 నుంచి) ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఇది అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- బైసెక్సువల్ సూపర్ మ్యాన్
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19 వ్యాక్సీన్: మొత్తం టీకాల్లో సగానికిపైగా చైనా నుంచే వచ్చాయా
- ‘వ్యాక్సీన్ వేసుకోను అన్నందుకు నా ఉద్యోగం తీసేశారు’
- అఫ్గానిస్తాన్: సేనల ఉపసంహరణ తర్వాత తొలిసారి తాలిబాన్లతో అమెరికా చర్చలు
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
- భారత్-పాక్ యుద్ధం 1971: చెరువులో నీటి అడుగున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్న భారత సైనికుడి కథ
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)