ఉప్పెన సినిమాలో కనిపించిన రామాలయం ఇప్పుడు లేదెందుకు? ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా?

వీడియో క్యాప్షన్, ఉప్పెన సినిమాలో కనిపించిన రామాలయం ఇప్పుడు లేదెందుకు? ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా?

ఈ ఊళ్లో ఇప్పటి వరకు నాలుగు ఆలయాలు, మూడు పాఠశాలలు, రెండు ట్రావెలర్స్ బంగ్లాలు సముద్రంలో కలిసి పోయాయి. ఈ మధ్య విడుదలైన 'ఉప్పెన' సినిమాలో సముద్రపు ఒడ్డున ఓ గుడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడా గుడి కూడా లేదు.

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో సముద్రం ఒడ్డున నివసిస్తున్న వారిని ప్రాణభయం నిత్యం వెంటాడుతోంది.

అందమైన జాంధానీ చీరలకు, చేనేత వృత్తి నైపుణ్యానికి నిలయంగా ఉండే ఊరు ఉప్పాడ. కానీ సముద్రపు అలల తాకిడితో ఈ గ్రామం అల్లాడిపోతోంది. గడిచిన రెండు దశాబ్దాల్లోనే వందల ఇళ్లు సముద్రగర్భంలో కలిసిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)