భారత్ పురుషుల హాకీ: నాలుగు దశాబ్దాల కల నిజమైన వేళ

వీడియో క్యాప్షన్, భారత్ పురుషుల హాకీ: నాలుగు దశాబ్దాల కల నిజమైన వేళ

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం భారత్, జర్మనీ పోటాపోటీగా తలపడ్డాయి. చివరకు 5-4 తేడాతో భారత జట్టు విజయం సాధించింది.

మొదటి 15 నిమిషాల్లోనే భారత్‌పై జర్మనీ గోల్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లింది. సెకండ్ క్వార్టర్‌లో భారత్ ఓ గోల్ కొట్టింది. అయితే, కాసేపటికే జర్మనీ మరో రెండు గోల్స్ కొట్టి తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత భారత్ కూడా మరో రెండు గోల్స్ కొట్టింది.

రెండో క్వార్టర్ ముగిసేనాటికి భారత్, జర్మనీ.. చెరో 3 గోల్స్ కొట్టాయి. అయితే, మూడో క్వార్టర్‌లో భారత్‌ మరో రెండు గోల్స్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లింది.

మొత్తంగా జర్మనీపై 5-4 తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నాలుగు దశాబ్దాల కల అలా నిజమైన వేళ...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)