ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు: పీవీ, మన్మోహన్ తీసుకున్న కీలక నిర్ణయాలేంటి?

వీడియో క్యాప్షన్, ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు: పీవీ, మన్మోహన్ తీసుకున్న కీలక నిర్ణయాలేంటి?

భారతదేశ ఆర్థిక స్వాతంత్ర్య దినోత్సవంగా 1991 జులై 24ను పేర్కొనడంలో ఎంత మాత్రం తప్పు లేదు. సరిగ్గా 30 సంవత్సరాల కిందట ఇదే రోజు సమర్పించిన బడ్జెట్ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు బాటలు పరిచింది.

1991 నాటికి భారతదేశం క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. అంటే ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంతమందిని వినియోగించాలి అన్నవన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ వ్యవస్థనే పర్మిట్‌ రాజ్ లేదంటే లైసెన్స్ రాజ్ అంటారు.

అందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తారు. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ 1991 జులై 24న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా మలుపు తిప్పింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)