కాటికాపరులుగా పనిచేస్తున్న ఇద్దరు మహిళలు

వీడియో క్యాప్షన్, శ్మశానంలో కాటికాపరులుగా పనిచేస్తున్న ఇద్దరు మహిళలు

కాటి కాపరులంటే సాధారణంగా పురుషులే ఉంటారు. శవాలను దహనం చేయడమన్నది మగవాళ్ల పనే అన్నది స్థిరపడిపోయింది. కానీ, అక్కడక్కడా మహిళలూ ఈ పని చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అలాంటి ఇద్దరు మహిళల కథే ఇది. తమ పనిలో ఉండే ఇబ్బందులు.. సమాజం తమను ఎలా చూస్తుందో వారు చెబుతున్నారు.

"రోజూ నాలుగైదు గంటలకే మాకు తెల్లవారుతుంది. శవాలను దహనం చేయాల్సి ఉంటుంది.

రాత్రిపూట కూడా ఈ పని చేస్తుంటాం. ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, ఏం చేస్తాం. మా పూట గడవాలంటే తప్పదు." అంటున్నారు వారు.

ఇంకా ఏం చెబుతున్నారో ఈ వీడియోలో చూడండి.

వీడియో: ఆదిత్య భరద్వాజ్, బీబీసీ కోసం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)