వలస కూలీల కష్టం: ఇంటికి చేరేందుకు 450 కిలోమీటర్లు నడిచిన చిన్నారి
ఈ చిన్నారి మహారాష్ట్రలోని పుణె నుంచి అదే రాష్ట్రంలోని ముద్కేడ్‌కు నడిచి వెళ్తోంది. మొత్తం 450 కిలోమీటర్ల ప్రయాణం.
లాక్‌డౌన్ కష్టాలకు ఎదురీదలేక నడుచుకుంటూ అయినా సొంతూరికి వెళ్లిపోవాలని మూటాముల్లె నెత్తిన పెట్టుకుని బయలుదేరిని తల్లిదండ్రులతో కలిసి నడుస్తోందీ బాలిక.
ఇలా పుణె, ముంబయి, ఇతర నగరాల్లో ఉన్న వలస కూలీలు తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు.
'నేను ఉదయం 3 గంటలకే నిద్ర లేచాను. అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాను. కొన్నిసార్లు రాత్రి 2 గంటల నుంచే నడక మొదలుపెడుతున్నాం. మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాం. చీకటిపడ్డాక మళ్లీ నడక ప్రారంభిస్తున్నాం'' అన్నారు వలస కూలీ అమీనా బీ.
ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించినా మహారాష్ట్రలో వలస కూలీలకు అవి అందుబాటులో లేవు.
'రెండు నెలలుగా పనిలేదు. నడిచి వెళ్తున్నా మమ్మల్ని ఆపుతున్నారు. మెడికల్ సర్టిఫికేట్లు తెమ్మంటే అవీ తెచ్చాం'' అన్నారామె.
అయితే, దారిలో వారికి కొందరు ఆహారం ఇస్తున్నారు.. అది కొంత ఊరట కలిగించే విషయమే.
రాష్ట్రప్రభుత్వ బస్సులు తిరుగుతున్నా వాటిని ఆపితే అందులో తమను ఎక్కించుకోవడం లేదని చెబుతున్నారు ఇలా నడుచుకుంటూ వెళ్తున్న కూలీలు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్ డౌన్ ఎత్తేస్తున్న యూరప్ దేశాలు.. ఏఏ దేశాల్లో ఏమేం ప్రారంభం అయ్యాయంటే..
- కరోనావైరస్: రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు
- కరోనావైరస్: తీవ్ర అనారోగ్యం పాలైన 30 శాతం రోగుల రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో ఖాళీ అయిన మహా నగరాల రోడ్లు మళ్లీ కిక్కిరిసిపోతున్నాయ్
- విశాఖ గ్యాస్ లీక్: తుప్పు పట్టిన పైపులు, అనుమతులు లేని కార్యకలాపాలు... ప్రమాద కారణాలపై బీబీసీ పరిశోధన
- కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
- సముద్రపు ముసుగు దొంగలు తుపాకుల మోతతో దాడి చేసి కిడ్నాప్ చేసిన రోజు...
- కరోనావైరస్: గల్ఫ్ దేశాల్లో దిక్కు తోచని స్థితిలో భారతీయ వలస కార్మికులు
- మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించిన తమిళనాడు, మహారాష్ట్ర
- కరోనా లాక్‌డౌన్: ఒంటరి వ్యక్తులు ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోండి – నెదర్లాండ్స్ ప్రభుత్వ మార్గదర్శకాలు
- కరోనావైరస్: లాక్ డౌన్ ఎత్తేస్తున్న యూరప్ దేశాలు.. ఏఏ దేశాల్లో ఏమేం ప్రారంభం అయ్యాయంటే..
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి? వేటిని దూరం పెట్టాలి?
- నిర్మలా సీతారామన్: .ఉపాధి హామీకి మరో రూ. 40 వేల కోట్లు... రాష్ట్రాల రుణపరిమితి పెంపు
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో ఖాళీ అయిన మహా నగరాల రోడ్లు మళ్లీ కిక్కిరిసిపోతున్నాయ్
- కరోనావైరస్: గల్ఫ్ దేశాల్లో దిక్కు తోచని స్థితిలో భారతీయ వలస కార్మికులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)