రిషి కపూర్ ఇక లేరు... 67 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన రొమాంటిక్ హీరో

ఫొటో సోర్స్, Getty Images
హిందీ సినీ నటుడు రిషి కపూర్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 67 ఏళ్ళు.
మంగళవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో చేర్పించారు. రిషికపూర్ మరణించినట్లు ఆయన అన్న రణధీర్ కపూర్ బీబీసీతో చెప్పారు.
"క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషీకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆస్పత్రిలో చేర్పించాం" రణధీర్ మంగళవారం తెలిపారు. అంతకు ముందు పిబ్రవరి నెలో కూడా రెండుసార్లు రిషీ కపూర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రఖ్యాత సినీ నటుడు రాజ్ కపూర్ రెండవ కుమారుడు రిషి కపూర్. ఆయన అన్న రణధీర్ కపూర్. తమ్ముడు రాజీవ్ కపూర్. రితు నందా, రిమా జైన్ ఆయన సోదరీమణులు.
1973లో బాబీ సినిమాతో రిషి కపూర్ హీరోగా తన నట జీవితాన్ని ప్రారంభించారు. శ్రీ420, మేరా నామ్ జోకర్ చిత్రాల్లో బాల నటుడిగా కనిపించారు.
రిషి మరణవార్తపై స్పందిస్తూ అమితాబ్ బచ్చన్, ఆయన వెళ్ళిపోయారు. నేను ధ్వంసమైపోయాను అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రిషి కపూర్ నటించిన చివరి చిత్రం 'ది బాడీ'. తన తదుపరి చిత్రం దీపికా పదుకొనేతో ఉంటుందని ఆయన ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రం హాలీవుడ్ సినిమా 'ది ఇంటర్న్'కు హిందీ రీమేక్. కానీ, ఈ సినిమా చేయకుండానే రిషి కన్నుమూశారు.
రిషి కపూర్ ఏ వ్యాధితో బాధపడుతున్నారు ?
రిషి కపూర్ గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. 2018 సంవత్సరంలో రిషి కపూర్ క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లారు. అక్కడ చాలా నెలలు చికిత్స పొందిన తరువాత 2019లో ఇండియాకు తిరిగి వచ్చారు. కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా ఆయన తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందు ఫిబ్రవరిలో కూడా రెండుసార్లు ఆసుపత్రి పాలయ్యారు.
మాటలు రావడం లేదన్న లతా మంగేష్కర్
ఇర్ఫాన్ ఖాన్ మరణించి 24 గంటలు కూడా కాకముందే రిషి కపూర్ ఇక లేరన్న వార్త రావడంతో భారత సినీ పరిశ్రమ అంతా విషాదంలో మునిగిపోయింది. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, 'రిషి తన చిన్నప్పటి ఫోటో నాకు పంపించాడు. అది అతడు పుట్టినప్పుడు నేను ఎత్తుకున్న ఫోటో. అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. మాట పెగలడం లేదు' అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రధాని మోదీ స్పందన
రిషి కపూర్ బహుముఖ ప్రజ్ఞాశీలి, అపారమైన ప్రతిభావంతుడని, ఆయన మరణం తనను ఎంతో బాధించిందని ప్రదాని మోదీ ట్వీట్ చేశారు. రిషి కపూర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ వారమంతా విషాదమే.. రాహుల్ గాంధీ
భారతీయ సినిమాకు ఈ వారం ఎంతో విషాదాన్ని మిగిల్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విభిన్న తరాల్లో అభిమానులను సంపాందించుకున్న మరొక లెజెండ్‌ను కోల్పోయామని రాహుల్ ట్వీట్ చేశారు. రిషి బంధు మిత్రులకు, అభిమానులకు తన సంతాపాన్ని ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
నటి ప్రియాంక చోప్రా, రిషి మరణ వార్తతో హృదయం బరువెక్కిందని అన్నారు. లెక్కకు అందని ప్రతిభ రిషి కపూర్ సొంతం అని ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఒక విషాదం తరువాత మరో విషాదం ముంచెత్తిందని అన్నారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6