You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: తెలంగాణలో దిల్లీ నిజాముద్దీన్ మత కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన ఆరుగురు మృతి
దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు వద్ద నిర్వహించిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణకు చెందిన ఆరుగురు కరోనావైరస్ సోకి చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్లో తెలిపింది. మార్చి 13-15 మధ్య వీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పింది.
ఆరుగురిలో ఇద్దరు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చనిపోయారు.
అపోలో ఆస్పత్రిలో ఒకరు, గ్లోబల్ ఆస్పత్రిలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాలలో ఒకరు చనిపోయారు.
దిల్లీలోని మార్కాజ్‌కు హాజరైన వారు ఎక్కడున్నారనే వివరాలను తెలియజేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితంగా చికిత్స అందిస్తామని చెప్పింది.
పదిహేను రోజుల కిందట జరిగిన మర్కజ్ మత కార్యక్రమానికి దాదాపు 1700 మంది హాజరయ్యారు. వారిలో థాయ్‌లాండ్, ఇండొనేసియా, మలేసియా, కిర్గిజిస్తాన్ తదితర ఆసియా దేశాల నుంచి వచ్చిన వాళ్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
వీరు తిరిగిన ప్రాంతాలను ప్రక్షాళన చేయటానికి అధికారులు చర్యలు చేపట్టారు. వారు ఎవరెవరిని కలిశారనే వివరాల మీద దృష్టి పెట్టారు. అధికారులు ఇప్పటికే మర్కజ్ మసీదును మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ప్రార్థనలు నిర్వహించిన మతపెద్దలపై కేసు నమోదు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: దిల్లీలో వలస కార్మికులు ఇంత భారీ సంఖ్యలో పోగవ్వడానికి బాధ్యులు ఎవరు?
- కరోనావైరస్: ‘నాలాంటి నాలుగు వేల మంది బతుకులు రోడ్డు మీద పడ్డాయి
- కరోనావైరస్: ఆయన మరణించారు.. బంధువుల్లో 19 మందికి సోకింది.. ఇంకా 40 వేల మందికి సోకిందేమోనన్న టెన్షన్
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే..
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: వెంటిలేటర్లు ఏంటి? అవి ఎందుకు ముఖ్యం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)